మూడేళ్ళలో జమ్మూ-ఢిల్లీ మధ్య ఇక 6 గంటలే ప్రయాణం

| Edited By: Anil kumar poka

Aug 13, 2020 | 1:37 PM

జమ్మూ-ఢిల్లీ మధ్య రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం ఇక ఆరు గంటలే ఉండబోతోంది. జమ్మూ కాశ్మీర్ లోని కాత్రా నుంచి ఢిల్లీ వరకు ఎక్స్ ప్రెస్ రోడ్డు కారిడార్ పనులు మొదలయ్యాయని, మరో మూడేళ్లలోగా ఇవి పూర్తి అవుతాయని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు...

మూడేళ్ళలో జమ్మూ-ఢిల్లీ మధ్య ఇక 6 గంటలే ప్రయాణం
Follow us on

జమ్మూ-ఢిల్లీ మధ్య రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం ఇక ఆరు గంటలే ఉండబోతోంది. జమ్మూ కాశ్మీర్ లోని కాత్రా నుంచి ఢిల్లీ వరకు ఎక్స్ ప్రెస్ రోడ్డు కారిడార్ పనులు మొదలయ్యాయని, మరో మూడేళ్లలోగా ఇవి పూర్తి అవుతాయని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ కారిడార్ పూర్తి అయితే ప్రజలు రైళ్ల ద్వారానో, విమానాల ద్వారానో కాకుండా రోడ్డు మార్గం ద్వారా జమ్మూ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి జమ్ముకు చేరవచ్ఛునని ఆయన చెప్పారు. రూ. 35 వేల కోట్ల అంచనాతో  చేపట్టిన ఈ  కారిడార్ జమ్మూ, కథువా, కాశ్మీర్, జలంధర్, అమృత్ సర్, , లూధియానాలను కలుపుతుందని, మార్గ మధ్యంలో పలు మతపరమైన మందిరాలు, గురుద్వారాలు ఉన్నాయని ఆయన వివరించారు.

పఠాన్ కోట్-జమ్మూ మధ్య జాతీయ రహదారిని వెడల్పు చేస్తున్నామని, దీంతో జమ్మూ, కథువా, పఠాన్ కోట్ మధ్య ప్రజలు సులభంగా ప్రయాణించవచ్ఛునని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల రహస్య కదలికలను దృష్టిలో ఉంచుకుని ఈ కారిడార్ పొడవునా భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని ఆయన చెప్పారు.