భారీ వర్షాలతో కొండ చరియలు విరిగి పడి గోవాలో పట్టాలు తప్పిన రైలు .. ప్రయాణికులు క్షేమం

| Edited By: Anil kumar poka

Jul 24, 2021 | 11:05 AM

కర్ణాటక లోని మంగుళూరు నుంచి ముంబై వస్తున్న ప్యాసింజర్ రైలు శనివారం ఉదయం గోవాలో పట్టాలు తప్పింది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. వశిష్టి నది పొంగి ప్రవహించిన కారణంగా నీరు పట్టాలపైకి చేరినందువల్ల...

భారీ వర్షాలతో కొండ చరియలు విరిగి పడి గోవాలో పట్టాలు తప్పిన రైలు .. ప్రయాణికులు క్షేమం
Train Hit By Landslide's
Follow us on

కర్ణాటక లోని మంగుళూరు నుంచి ముంబై వస్తున్న ప్యాసింజర్ రైలు శనివారం ఉదయం గోవాలో పట్టాలు తప్పింది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. వశిష్టి నది పొంగి ప్రవహించిన కారణంగా నీరు పట్టాలపైకి చేరినందువల్ల కూడా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. మడగావ్-లోండా-మీరజ్ సెక్షన్ మీదుగా దారి మళ్లించిన ఈ ట్రెయిన్ గోవాలోని దుంద్ సాగర్- సోనాలిమ్ సెక్షన్ వద్ద పట్టాలు తప్పినట్టు వారు చెప్పారు. దీని ఇంజన్ సహా కొన్ని బోగీలు పూర్తిగా పక్కకు పడిపోయాయన్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్ ప్రయాణికులెవరూ గాయపడలేదు., వీరిని మరో కోచ్ లోకి తరలించి వారి వారి గమ్య స్థానాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సౌత్ వెస్టర్న్ రైల్వేలో దుంద్ సాగర్-కరంజోల్ స్టేషన్ల మధ్య కొండ చరియలు విరిగిపడడంతో హజ్రత్-నిజాముడ్డీన్, వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్, వాస్కోడిగామా- తిరుపతి ఎక్స్ ప్రెస్, వాస్కోడిగామా తిరుపతి-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లను రద్దు చేశారు.

మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా వందమందికి పైగా మరణించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో కూడా అనేక చోట్ల ఒక మాదిరి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముగ్గురు గల్లంతయ్యారని, సహాయక బృందాలు నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించాలని, కేంద్రం వెంటనే బాధిత రాష్ట్రాలను ఆదుకోవాలని ఆయా ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch: వాన కష్టం వరద నష్టం.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 అత్యాశకు పోతే అంతే ఉంటది మరి..!ఇన్సూరెన్స్‌ డబ్బు ఆశతో బెంజ్‌ కారు తగులబెట్టిన వ్యక్తి..:Benz car Video.

 యజమాని కోసం పిల్లి చేసిన సాహసం..పాముతో ఫైట్ చేసి మరి యజమానికి ముప్పు తప్పించింది..వీడియో:Cat Fight With Snake Video.

 ఐదు కొమ్ములతో అరుదైన గొర్రె..!ఎందుకిలా..?యుగాంతానికి సంకేతమా..?:sheep has 5 horns Video.