మాల్దీవుల నుంచి భారతీయుల తరలింపునకు బయల్దేరిన నౌకలు

| Edited By: Anil kumar poka

May 05, 2020 | 10:59 AM

మాల్దీవులు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చిక్కుబడిపోయిన భారతీయుల తరలింపునకు మూడు నౌకలు బయలుదేరాయి. ముంబై తీర ప్రాంతం నుంచి ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ మగర్ నౌకలు బయల్దేరగా...

మాల్దీవుల నుంచి భారతీయుల తరలింపునకు బయల్దేరిన నౌకలు
Follow us on

మాల్దీవులు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చిక్కుబడిపోయిన భారతీయుల తరలింపునకు మూడు నౌకలు బయలుదేరాయి. ముంబై తీర ప్రాంతం నుంచి ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ మగర్ నౌకలు బయల్దేరగా.. దుబాయ్ లోని భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఐఎన్ఎస్ శార్దూల్ షిప్ కూడా వెళ్లిందని నౌకా దళ వర్గాలు తెలిపాయి. ఈ మూడు నౌకలు త్వరలో భారతీయులతో కొచ్చికి తిరిగి వస్తాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి.  విదేశాల్లో చిక్కుబడిన భారతీయులను తరలించేందుకు ఈ నెల 7 నుంచి విమానాలను కూడా పంపనున్నారు. అయితే ప్రతి భారతీయుడు విధిగా ఆరోగ్య సేతు యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ప్రతి వ్యక్తికీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన తరువాతే దేశంలోకి అనుమతిస్తారు. ఏ మాత్రం కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినా క్వారంటైన్ కి తరలిస్తారు.