Fake Calls: టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్, ఎందుకంటే

|

Mar 29, 2024 | 6:26 PM

మీకు టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయి.. అయితే బీ అలర్ట్. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఆ ఫోన్ కాల్స్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం శాఖ జనాలను అప్రమత్తం చేసింది. కొందరు నేరగాళ్లు మొబైళ్ల నెంబర్లను డిస్ కనెక్ట్ చేస్తామంటూ బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చి చెప్పింది.

Fake Calls: టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్, ఎందుకంటే
Whatsapp
Follow us on

మీకు టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయి.. అయితే బీ అలర్ట్. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఆ ఫోన్ కాల్స్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం శాఖ జనాలను అప్రమత్తం చేసింది. కొందరు నేరగాళ్లు మొబైళ్ల నెంబర్లను డిస్ కనెక్ట్ చేస్తామంటూ బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చి చెప్పింది. ఈ విషయం టెలికాం ద్రుష్టికి రావడంతో ప్రజలను అలర్ట్ చేసింది.

మొబైల్ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్, ప్రభుత్వ అధికారుల పేరుతో మోసం చేయడంపై టెలికాం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ప్రజలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీనిలో టెలికాం శాఖ పేరుతో కాల్ చేసిన వ్యక్తులు వారి మొబైల్ నంబర్లన్నింటినీ డిస్కనెక్ట్ చేస్తాం అని లేదా కొన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు” అని తెలిపింది.

సైబర్ నేరగాళ్లు, ఇటువంటి కాల్స్ ద్వారా సైబర్ క్రైమ్ లేదా ఆర్థిక మోసాలకు పాల్పడేందుకు కాల్స్ చేస్తున్నట్లు గుర్తించింది. అయితే టెలికాం శాఖ తన తరఫున అలాంటి కాల్స్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు అని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి కాల్స్ స్వీకరించడంపై ఎటువంటి సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయకూడదని సూచించింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ లేదా ఆర్థిక మోసానికి గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలని టెలికాం శాఖ సూచించింది.