ఈ ఉగ్రవాది నాడు భారత జవాన్లను రక్షించాడట

| Edited By: Pardhasaradhi Peri

Sep 24, 2020 | 7:01 PM

బడ్గామ్ ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాది ఆసిఫ్ ముజఫర్ షా ఒకప్పుడు వరదల బారి నుంచి భారత జవాన్లను రక్షించాడట. 2014 లో జమ్మూ కాశ్మీర్ లోని పాంపోర్ జిల్లాలో పోటెత్తిన వరదల్లో కొట్టుకుపోతున్న సుమారు డజను మంది జవాన్లను..

ఈ ఉగ్రవాది నాడు భారత జవాన్లను రక్షించాడట
Follow us on

బడ్గామ్ ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాది ఆసిఫ్ ముజఫర్ షా ఒకప్పుడు వరదల బారి నుంచి భారత జవాన్లను రక్షించాడట. 2014 లో జమ్మూ కాశ్మీర్ లోని పాంపోర్ జిల్లాలో పోటెత్తిన వరదల్లో కొట్టుకుపోతున్న సుమారు డజను మంది జవాన్లను ఆసిఫ్ కాపాడాడని వెల్లడైంది. ఇంత ‘మంచివాడైన’ ఈ టెర్రరిస్టు గత ఆగస్టులో ఉగ్రవాద కార్యకలాపాల పట్ల ఆకర్షితుడై వారిలో చేరిపోయాడు. బడ్గామ్ జిల్లా చరారే షరీఫ్ టౌన్ దగ్గరి నవహార్ గ్రామంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఆసిఫ్ మృతి చెందాడు. సైన్యం ఇతని గత చరిత్ర తెలుసుకుని ఆశ్చర్యపోయింది. నాడు భారత జవాన్లను వరదల నుంచి రక్షించినందుకు ఇతడిని ఆర్మీ అధికారులు ..సైన్యంలో చేరవలసిందిగా కోరినప్పటికీ తిరస్కరించాడని తెలిసింది.