Tamilnadu Lockdown News: తమిళనాడులో వారం పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్, ప్రజలు ఇష్టం వచ్చినట్టు వీధుల్లోకి వస్తే సహించం , సీఎం ఎం.కె.స్టాలిన్

| Edited By: Phani CH

May 22, 2021 | 3:53 PM

తమిళనాడులో పూర్తి లాక్ డౌన్ విధించారు. వారం పాటు ఇది అమల్లో ఉంటుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. గత 24 గంటల్లో 36 వేలకు పైగా కోవిద్ కేసులు నమోదు కావడంతో ఈ చర్య తీసుకున్నట్టు ఆయన చెప్పారు.

Tamilnadu Lockdown News:  తమిళనాడులో వారం పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్,  ప్రజలు ఇష్టం  వచ్చినట్టు వీధుల్లోకి వస్తే  సహించం , సీఎం ఎం.కె.స్టాలిన్
Tamilnadu Cm Mk Stalin Letter
Follow us on

తమిళనాడులో పూర్తి లాక్ డౌన్ విధించారు. వారం పాటు ఇది అమల్లో ఉంటుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. గత 24 గంటల్లో 36 వేలకు పైగా కోవిద్ కేసులు నమోదు కావడంతో ఈ చర్య తీసుకున్నట్టు ఆయన చెప్పారు. నిజానికి ఈ నెల 24 న ప్రస్తుత లాక్ డౌన్ ముగియాల్సి ఉంది. కానీ శనివారం రాష్ట్రంలో కోవిద్ పరిస్థితిపై వైద్య నిపుణులతో చర్చించిన అనంతరం ఎలాంటి అనుమతులు, సడలింపులు లేకుండా వారం పాటు దీన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కఠిన లాక్ డౌన్ అమలు చేయాలని నిపుణులు సూచించారన్నారు. ఆంక్షలు సడలిస్తే పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుందని వారు అభిప్రాయపడ్డారని ఆయన చెప్పారు. అయితే రేపు మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు ప్రజలు నిత్యావసరాల కొనుకోలుకు వీలుగా అనుమతిస్తున్నట్టు ఆయన చెప్పారు. (వాస్తవానికి రాష్ట్రంలో శని, ఆదివారాలు పూర్తి లాక్ డౌన్ అమల్లో ఉంటుంది). లాక్ డౌన్ నిబంధనలను ఖాతరు చేయకుండా ప్రజలు ఇష్టం వచ్చినట్టు వీధుల్లోకి వస్తున్నారని, ఇది హాలిడే సీజన్ కాదని, ఇది కరోనా సీజన్ అని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ధోరణిని సహించే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు.

రాష్ట్రంలో కోవిద్ వ్యాప్తిచెందుతూనే ఉందని, అయితే తీవ్రత తగ్గిందని ఆయన చెప్పారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడి మృతి చెందడం బాధాకరమన్నారు. వారు తమ కుటుంబాలకు కూడా దూరంగా ఉంటూ కరోనా రోగులకు సేవలు చేస్తున్నారని, వారి త్యాగాలు మరువలేమని ఆయన చెప్పారు. ప్రజలు లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఇది వారి మంచికేనన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: విద్యుత్ సిబ్బందిని చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకోండి… డీజీపీని ఆదేశించిన మంత్రి

Diabetic: మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా..? మీ రోజు వారీ ఆహారంలో వేరుశనగలు జోడించండి..!