వికాస్ దూబే కేసు.. పోలీసు అధికారి అరెస్ట్

| Edited By: Pardhasaradhi Peri

Jul 08, 2020 | 5:57 PM

హిస్టరీ షీటర్ వికాస్ దూబే పారిపోవడానికి సహకరించాడనే ఆరోపణపై వినయ్ తివారీ అనే పోలీసు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. దూబే నివసిస్తున్న బిక్రు గ్రామంలోని పోలీసు స్టేషన్ లో హౌస్ ఆఫీసర్..

వికాస్ దూబే కేసు.. పోలీసు అధికారి అరెస్ట్
Follow us on

హిస్టరీ షీటర్ వికాస్ దూబే పారిపోవడానికి సహకరించాడనే ఆరోపణపై వినయ్ తివారీ అనే పోలీసు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. దూబే నివసిస్తున్న బిక్రు గ్రామంలోని పోలీసు స్టేషన్ లో హౌస్ ఆఫీసర్ అయిన తివారీ.. గతంలో కూడా వికాస్ దూబేపై వఛ్చిన ఫిర్యాదులను బుట్ట దాఖలు చేశాడట. దూబేపై  బాధితులు చేసిన ఆరోపణలను ఇతగాడు పట్టించుకోలేదని తెలిసింది. ఈ నెల 5 న వినయ్ తివారీని సస్పెండ్ చేసి ఈరోజు అరెస్టు చేశారు. అటు-ఇదే పోలీసు స్టేషన్ లో పని చేసే కె.కె.శర్మ అనే మరో పోలీసు అధికారిని కూడా అరెస్టు చేశారు..

వికాస్ దూబే ని పట్టుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసు బృందాలను నియమించారు. అతని సహచరుల్లో ఒకరిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయగా.. మరొకరిని అరెస్టు చేశారు.