సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు…సుబ్రమణ్య స్వామి లేఖపై స్పందించిన ప్రధాని

| Edited By: Pardhasaradhi Peri

Jul 27, 2020 | 12:21 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుపై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి రాసిన లేఖమీద ప్రధాని మోదీ స్పందించారు. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని తన లేఖలో స్వామి కోరారు...

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు...సుబ్రమణ్య స్వామి లేఖపై స్పందించిన ప్రధాని
Follow us on

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుపై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి రాసిన లేఖమీద ప్రధాని మోదీ స్పందించారు. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని తన లేఖలో స్వామి కోరారు. జులై 15 నే ఆయన రాసిన లేఖ తమకు అందిందని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్వామికి సమాచారం అందింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక అది హత్యా అన్నదానిపై ముంబై పోలీసులు ఇంకా దర్యాప్తు జరుగుతుండగా సుబ్రమణ్యస్వామి నేరుగా ప్రధాని కార్యాలయానికి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుశాంత్ ఘటనపై పోలీసులు పలువురు  బాలీవుడ్ సెలబ్రిటీలను విచారిస్తున్నారు. అయితే ఈ కేసును ఇండస్ట్రీలోని బడా సెలబ్రిటీలు కప్పి పుచ్ఛడానికి ప్రయత్నిస్తున్నారని తనకు కొన్ని వర్గాల ద్వారా తెలిసిందని సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు.

దుబాయ్ లో ‘చీకటి సామ్రాజ్యాన్ని’ నడుపుతున్న కొందరు డాన్ లతో ఈ సెలబ్రిటీలకు లింక్ ఉందని, ఈ కేసులో పోలీసుల దర్యాప్తును కప్పిపుచ్చడానికి, సుశాంత్ సింగే ఆత్మహత్య చేసుకున్నాడని చూపేలా నిర్ధారించడానికి ఈ బడా బాబులు కొంతమంది యత్నిస్తున్నారని తనకు తెలిసిందని స్వామి అన్నారు. అందువల్ల వాస్తవాలు బయటపడడానికి దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఆయన ప్రధానికి లేఖ రాశారు.

జూన్ 14 న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబై బాంద్రా లోని తన నివాసంలో ఉరివేసుకున్న స్థితిలో కనబడ్డాడు. కొన్ని నెలలుగా ఆయన డిప్రెషన్ లో ఉన్నాడని, చికిత్స పొందుతూ వచ్చాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరోవైపు బాలీవుడ్ లో ఓ బలమైన ‘పవర్ కంపెనీ’ అతడిని ఎదగనివ్వకుండా చూసిందని కూడా వార్తలు వెల్లువెత్తాయి. ఆయనది  సూసైడ్ కాదని, మర్డర్ అని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. అందుకే  సమగ్ర విచారణ జరిపించాలని అవి డిమాండ్ చేశాయి. అయితే ఇన్ని రోజులుగా చాలామంది  సెలబ్రిటీలను పోలీసులు విచారిస్తున్నప్పటికీ.. పెద్దగా ఫలితం కనిపించడంలేదు.