సుశాంత్ కేసు దర్యాప్తు బాధ్యత సీబీఐకే ఎందుకు ? ‘సుప్రీం’ వివరణ

| Edited By: Anil kumar poka

Aug 19, 2020 | 12:33 PM

సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకే అప్పగించడానికి గల కారణాలను సుప్రీంకోర్టు వివరించింది. ముంబై పోలీసులు దీన్ని కేవలం యాక్సిడెంటల్ డెత్ గా పరిగణించారని, దానివల్ల ఇన్వెస్టిగేట్ చేయడానికి వారికి పరిమితంగా మాత్రమే అధికారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.

సుశాంత్ కేసు దర్యాప్తు బాధ్యత సీబీఐకే ఎందుకు ? సుప్రీం వివరణ
Follow us on

సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకే అప్పగించడానికి గల కారణాలను సుప్రీంకోర్టు వివరించింది. ముంబై పోలీసులు దీన్ని కేవలం యాక్సిడెంటల్ డెత్ గా పరిగణించారని, దానివల్ల ఇన్వెస్టిగేట్ చేయడానికి వారికి పరిమితంగా మాత్రమే అధికారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అయితే బిహార్ పోలీసులు పూర్తి స్థాయి ఎఫ్ ఐ ఆర్ ని నమోదు చేశారని, దీన్ని అప్పుడే సీబీఐ కి రెఫర్ చేశారని కోర్టు వెల్లడించింది. సీబీఐ దర్యాప్తునకు మహారాష్ట్ర పోలీసులు పూర్తిగా సహకరించాలని, సుశాంత్ మృతికి సంబంధించి మరో కేసు ఏదైనా నమోదు చేసిఉంటే దాన్ని కూడా సీబీఐకి అప్పగించాలని న్యాయమూర్తులు ఆదేశించారు.

ఇక సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సుప్రీంకోర్టు ఉత్తర్వులపట్ల హర్షం వ్యక్తం చేసింది. భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, అయితే ఇది సత్యానికి దారి తీసే తొలి అడుగు (సీబీఐ దర్యాప్తు) మాత్రమేనని ఆమె ట్వీట్ చేసింది. సీబీఐ ఇన్వెస్టిగేషన్ వల్ల న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నానని ఆమె పేర్కొంది.