సుశాంత్ కేసులో ‘మీడియా విచారణ’, ముంబై మాజీ పోలీసు బాసుల ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Sep 03, 2020 | 4:33 PM

సుశాంత్ సింగ్ కేసులో ముంబై పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చేలా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్రలో 8 మంది మాజీ పోలీసు బాసులు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..

సుశాంత్ కేసులో మీడియా విచారణ, ముంబై మాజీ పోలీసు బాసుల ఫైర్
Follow us on

సుశాంత్ సింగ్ కేసులో ముంబై పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చేలా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్రలో 8 మంది మాజీ పోలీసు బాసులు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మీడియా అత్యుత్సాహం చూపుతోందని, అనుచితమైన, దురుద్దేశపూరితమైన ప్రచారానికి దిగుతోందని వారు ఆరోపించారు. మీడియా హౌసుల్లో కొన్ని…. ప్రస్తుతం జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నాయని, కొన్ని టీవీ చానళ్ల యాంకర్లు 24 గంటలూ ముంబై పోలీసు శాఖను, చీఫ్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోందని వారన్నారు. నిజానికి దేశంలో అతి ప్రాచీన, సమర్థవంతమైనదిగా  ముంబై పోలీసు శాఖ పాపులర్ అయిందన్నారు.

అసలు ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఎలాంటి పక్షపాతం లేకుండా ఉండేట్టుగాను, అలాగే మీడియా వారి  రిపోర్టింగ్ కూడా పక్షపాతరహితంగాను ఉండేటు చూడాలని వారు కోర్టును అభ్యర్థించారు. గత నెల 31 న ఈ మాజీ పోలీసు అధికారులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. మహారాష్ట్ర హోమ్ శాఖ  మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వీరి పిటిషన్ పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. వీరిని అభినందించారు.