భారత్ లో ఈయూ ఎంపీలు.. ఏమంటున్నారు ?

|

Oct 30, 2019 | 1:54 PM

కశ్మీర్ సమస్యకు శాంతియుతంగా పరిష్కారాన్ని కనుగొనేందుకు, ఉగ్రవాదం అంతానికి ఇండియా చేస్తున్న కృషికి తాము పూర్తి మద్దతునిస్తామని యూరోపియన్ యూనియన్ ఎంపీలు ప్రకటించారు. 23 మందితో కూడిన ఈ ప్రతినిధిబృందం జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం కేవలం కొద్దిమంది ఎంపిక చేసిన మీడియా జర్నలిస్టుల సమావేశంలో వీరు మాట్లాడారు. కశ్మీర్ లోని పరిస్థితిని, సమాచారాన్ని తెలుసుకునేందుకు తాము వచ్చామని, అంతే తప్ప భారత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి కాదని ఓ ఎంపీ స్పష్టం చేశారు. […]

భారత్ లో ఈయూ ఎంపీలు.. ఏమంటున్నారు ?
Follow us on

కశ్మీర్ సమస్యకు శాంతియుతంగా పరిష్కారాన్ని కనుగొనేందుకు, ఉగ్రవాదం అంతానికి ఇండియా చేస్తున్న కృషికి తాము పూర్తి మద్దతునిస్తామని యూరోపియన్ యూనియన్ ఎంపీలు ప్రకటించారు. 23 మందితో కూడిన ఈ ప్రతినిధిబృందం జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం కేవలం కొద్దిమంది ఎంపిక చేసిన మీడియా జర్నలిస్టుల సమావేశంలో వీరు మాట్లాడారు.


కశ్మీర్ లోని పరిస్థితిని, సమాచారాన్ని తెలుసుకునేందుకు తాము వచ్చామని, అంతే తప్ప భారత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి కాదని ఓ ఎంపీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు అమాయకులను హతమార్చడం పట్ల ఈ ఎంపీలు విచారం వ్యక్తం చేశారు. ఇండియాకు మేం మిత్రులం అని మరో ఎంపీ వ్యాఖ్యానించారు. ‘ మా పట్ల భారత ప్రభుత్వం, స్థానిక అధికారులు చూపిన ఆదరణ, ఆప్యాయతకు మా కృతజ్ఞతలు ‘ అని ఒకరు పేర్కొన్నారు.
కశ్మీర్ లో సైనిక అధికారులతో సమావేశాలు జరిపిన అనంతరం ఈ ఎంపీల బృందం బోట్లలో దాల్ సరస్సులో కొద్దిసేపు షికారు చేశారు. తాము బస చేసిన సెంటూర్ హోటల్ సమీపం నుంచి వీరు ఆ సరస్సు వద్దకు చేరుకున్నారు. ఈ ప్రాంతంలోనే గత ఆగస్టు 5 న 30 మందికి పైగా రాజకీయనాయకులను పోలీసులు నిర్బంధం లోకి తీసుకున్నారు.
కాగా-తమ పర్యటనలో వీరు నిర్మానుష్యమైన రోడ్లను చూశారు. అత్యంత భద్రత గల సెక్యూరిటీతో ఈ ఎంపీలు పర్యటించారు. వీరిని కలుసుకునేందుకు ఏ రాజకీయ పార్టీని గానీ, స్వఛ్చంద సంస్థను గానీ అధికారులు అనుమతించలేదు. మొత్తం 27 మంది ఈయూ ఎంపీల్లో నలుగురు తమ స్వదేశాలకు తరలి వెళ్లారు. అటు-కుల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో పశ్చిమ బెంగాల్ కు చెందిన అయిదుగురు కూలీలు మరణించారు. అయితే ఈ సమాచారం ఈ ఎంపీలకు చేరిందో.. లేదోతెలియదు. లేదా… తెలిసినా ఆ విషయాన్ని వీరు గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.