కాలుష్యానికి కళ్లెం, పాత వాహనాలపై గ్రీన్ టాక్స్, కేంద్రం అంగీకారం, ఓల్డ్ వెహికల్స్ ఇక తుక్కు కిందే !

| Edited By: Pardhasaradhi Peri

Jan 26, 2021 | 11:06 AM

పాత వాహనాలపై గ్రీన్ టాక్స్ విధించాలన్న ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదముద్ర వేశారు..

కాలుష్యానికి కళ్లెం, పాత వాహనాలపై గ్రీన్ టాక్స్, కేంద్రం అంగీకారం, ఓల్డ్ వెహికల్స్ ఇక తుక్కు కిందే !
Follow us on

పాత వాహనాలపై గ్రీన్ టాక్స్ విధించాలన్న ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదముద్ర వేశారు. కాలుష్యాన్ని వెదజల్లే కార్లు, ఇతర వాహనాలకు ఇక కళ్లెం   వేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. 15 ఏళ్లకు పైగా పాతబడిన అన్ని వాహనాలకు ఈ సూత్రం వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల విషయంలో తామీ చర్య తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రజలు సాధ్యమైనంత వరకు కాలుష్యాన్ని వెదజల్లని, ఎలెక్ట్రానిక్ వాహనాలను వాడాలని అధికారులు సూచిస్తున్నారు. 2022 ఏప్రిల్ నుంచి ప్రభుత్వం స్క్రాపింగ్ పాలసీని అమలు చేయనుంది. అంటే ఓల్డ్ వెహికల్స్ ని గుర్తించి ఇక వాటిని తుక్కు కింద అమ్మేయాలన్నదే ఈ పాలసీ.. ఢిల్లీ, కోల్ కతా, ముంబై వంటి మహానగరాల్లో కాలుష్యం పరిమితికి మించి ఉంటోంది. ఇది ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ చర్య తీసుకుంది.