అవిగో హిమాలయాలు.. ‘దగ్గరవుతున్న హిమ సుందర దృశ్యాలు’

| Edited By: Pardhasaradhi Peri

May 11, 2020 | 6:16 PM

బీహార్, యూపీ వంటి రాష్ట్రాలకు ఎత్తయిన సుందర హిమాలయాలు దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. అత్యంత సుదూరంలో ఉన్న వీటిని తమ ప్రాంతాల నుంచే చూసే భాగ్యం తమకు  కలిగిందని ఈ రాష్ట్రాల్లోని ప్రాంతాల వాసులు కొందరు పరవశం చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితం బీహార్ లోని ఓ గ్రామవాసులు ఈ శిఖరాలను చూడగా.. ఇప్పుడు యూపీ లోని సహరన్ పూర్ ప్రజలకు  కూడా ఇవి కనిపించాయి. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయాలను చూడడం అద్భుత దృశ్యమని, […]

అవిగో హిమాలయాలు.. దగ్గరవుతున్న హిమ సుందర దృశ్యాలు
Follow us on

బీహార్, యూపీ వంటి రాష్ట్రాలకు ఎత్తయిన సుందర హిమాలయాలు దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. అత్యంత సుదూరంలో ఉన్న వీటిని తమ ప్రాంతాల నుంచే చూసే భాగ్యం తమకు  కలిగిందని ఈ రాష్ట్రాల్లోని ప్రాంతాల వాసులు కొందరు పరవశం చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితం బీహార్ లోని ఓ గ్రామవాసులు ఈ శిఖరాలను చూడగా.. ఇప్పుడు యూపీ లోని సహరన్ పూర్ ప్రజలకు  కూడా ఇవి కనిపించాయి. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయాలను చూడడం అద్భుత దృశ్యమని, తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నామని వీరు అంటున్నారు. తమకు ఈ అవకాశం దక్కడం ఇది రెండో సారని స్థానికులు తెలిపారు. గత నెల 30 న ఈ శిఖరాలను చూడగలిగామని, మళ్ళీ సోమవారం ఉదయమే ఈ బ్యూటిఫుల్ సీన్ కనిపించిదని ప్రకృతి ప్రేమికుడు ఒకరు తెలిపారు. తుపాను వాతావరణం, భారీ వర్షాలు గాలిని నిర్మలంగా చేయడంవల్ల హిమాలయాలను చూడగలిగామని వీరు అంటున్నా.. లాక్ డౌన్ కారణంగా కాలుష్యం మటుమాయమై.. హిమాలయాలు దగ్గరగా కనిపిస్తున్నాయని మరికొందరు చెబుతున్నారు. పలువురు ఈ ఫోటోలను మీడియాతో షేర్ చేసుకున్నారు.