ఢిల్లీలో మళ్ళీ ‘స్వల్పంగా’ కరోనా కేసులు పెరిగాయి, అరవింద్ కేజ్రీవాల్

| Edited By: Anil kumar poka

Aug 26, 2020 | 2:18 PM

గత కొన్ని రోజులుగా ఢిల్లీలో స్వల్పంగా కరోనా వైరస్ కేసులు పెరిగాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అందువల్ల  ముందు జాగ్రత్త చర్యగా టెస్టింగులను మరింత రెట్టింపు చేస్తామన్నారు.

ఢిల్లీలో మళ్ళీ స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి, అరవింద్ కేజ్రీవాల్
Follow us on

గత కొన్ని రోజులుగా ఢిల్లీలో స్వల్పంగా కరోనా వైరస్ కేసులు పెరిగాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అందువల్ల  ముందు జాగ్రత్త చర్యగా టెస్టింగులను మరింత రెట్టింపు చేస్తామన్నారు. ‘టెస్ట్’, ‘ఐసొలేట్’ అన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు.  లోగడ నగరంలో అత్యధికంగా కేసులు నమోదయినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆయన చెప్పారు. ఇక రీకవరీ రేటు అయితే 90 శాతం ఉందని, దేశవ్యాప్తంగా సగటున ఇది 76 శాతమేనని ఇవాళే తెలిసిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దయచేసి టెస్టింగులు చేయించుకోండి.. కరోనా  లక్షణాలు కనబడితే ఇంట్లో ఐసోలేషన్ లోనే ఉండండి అని ప్రజలను ఆయన కోరారు. ఇక మంగళవారం ఒక్క రోజే ఈ సిటీలో 1544 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1.64 లక్షలకు పెరిగి