నిరసనకారులకు టీ, స్నాక్స్.. ముందుకొచ్చిన సిక్కులు.. నెటిజన్ల ప్రశంసలు

|

Dec 18, 2019 | 5:56 PM

వివాదాస్పదమైన సీఏఏ చట్టాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సిక్కు సంస్థ ‘ ఖల్సా ‘ కు చెందిన వలంటీర్లు టీ, స్నాక్స్ ఇఛ్చి తమ ఉదారతను చూపారు. మీ వెంట మేం ఉన్నామని బాసటగా నిలిచారు. ఉదయం 6 గంటల నుంచే వీరు అప్పటికప్పుడు టీ, స్నాక్స్ తయారు చేసి విద్యార్థులకు అందించారు. సిక్కుల ఔదార్యాన్ని సోషల్ మీడియా ద్వారా అనేకమంది నెటిజన్లు అభినందించారు. సిక్కు సోదరులు చేస్తున్న ఈ […]

నిరసనకారులకు టీ, స్నాక్స్.. ముందుకొచ్చిన సిక్కులు.. నెటిజన్ల ప్రశంసలు
Follow us on

వివాదాస్పదమైన సీఏఏ చట్టాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సిక్కు సంస్థ ‘ ఖల్సా ‘ కు చెందిన వలంటీర్లు టీ, స్నాక్స్ ఇఛ్చి తమ ఉదారతను చూపారు. మీ వెంట మేం ఉన్నామని బాసటగా నిలిచారు. ఉదయం 6 గంటల నుంచే వీరు అప్పటికప్పుడు టీ, స్నాక్స్ తయారు చేసి విద్యార్థులకు అందించారు. సిక్కుల ఔదార్యాన్ని సోషల్ మీడియా ద్వారా అనేకమంది నెటిజన్లు అభినందించారు. సిక్కు సోదరులు చేస్తున్న ఈ సేవ ఎంతో గొప్పదని, వారికి స్టూడెంట్స్ ఎంతో కృతజ్ఞులై ఉంటారని వారు పేర్కొన్నారు. ఈ సోదరులు నిజమైన హీరోలని అభివర్ణించారు. కాగా-ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన సిక్కులు, సిక్కు విద్యార్థులు సాయంత్రం సుమారు ఆరు గంటలవరకు స్వచ్ఛందంగా ఈ ‘ సేవ ‘ చేయడం విశేషం.