రాత్రి 9 నిముషాలు లైట్లన్నీ ఆర్పేస్తే.. డేంజరే ! మహారాష్ట్ర మంత్రి

| Edited By: Anil kumar poka

Apr 04, 2020 | 11:06 AM

కరోనాపై పోరాటంలో భాగంగా ఈ నెల 5 వ తేదీ రాత్రి 9 గంటల 9 నిముషాలకు 9 నిముషాలసేపు ప్రజలంతా ఇళ్లలో లైట్లన్నీ ఆర్పేసి.. బాల్కనీల్లో,  ఇళ్ల తలుపుల వద్ద కొవ్వొత్తులు, లాంతర్లు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించాలని ప్రధాని మోదీ ఇఛ్చిన పిలుపుపై విమర్శలు ప్రారంభమయ్యాయి.

రాత్రి 9 నిముషాలు లైట్లన్నీ ఆర్పేస్తే.. డేంజరే ! మహారాష్ట్ర మంత్రి
Follow us on

కరోనాపై పోరాటంలో భాగంగా ఈ నెల 5 వ తేదీ రాత్రి 9 గంటల 9 నిముషాలకు 9 నిముషాలసేపు ప్రజలంతా ఇళ్లలో లైట్లన్నీ ఆర్పేసి.. బాల్కనీల్లో,  ఇళ్ల తలుపుల వద్ద కొవ్వొత్తులు, లాంతర్లు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించాలని ప్రధాని మోదీ ఇఛ్చిన పిలుపుపై విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇలా చేయడంవల్ల ఎమర్జెన్సీ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతుందని మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ హెచ్చరించారు. అన్ని లైట్లనూ ఒకేసారి ఆర్పడంవల్ల గ్రిడ్ ఫెయిలవుతుందని, అత్యవసర సర్వీసులు నిలిచిపోతాయని ఆయన అన్నారు. ఇంతేకాదు.. దీనివల్ల డిమాండ్ కు, సరఫరాకు మధ్య ఎంతో తేడా ఏర్పడుతుంది. లాక్ డౌన్ ఫలితంగా డిమాండ్ ఇప్పటికే విద్యుత్ 23 వేల మెగావాట్ల నుంచి 13 వేల మెగావాట్లకు తగ్గిపోయింది అని ఆయన పేర్కొన్నారు. పైగా విద్యుత్ సర్వీసులను పునరుధ్దరించడానికి 12 నుంచి 16 గంటలు పడుతుందని, ఫ్యాక్టరీ యూనిట్లను  ఆపరేట్ చేయడం కష్టసాధ్యమవుతుందని నితిన్ రౌత్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ పై జరిపే పోరాటంలో విద్యుత్ కూడా ప్రధాన పాత్ర వహిస్తుందన్నారు. మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర ఆహద్ కూడా .. మోదీ ఇఛ్చిన పిలుపు మూర్ఖత్వమని,  బాల్య చేష్ట అని విమర్శించారు.

శశిథరూర్ వంటి కాంగ్రెస్ నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజల కన్నీళ్లను ఎలా తుడవాలో, వారి ఆర్ధిక కష్టాలను ఎలా నివారించాలో తెలియని ఈ ప్రధానికి భవిష్యత్ పై గానీ, లాక్ డౌన్ తరువాత పరిస్థితులను ఎలా బేరీజు వేయాలో తెలియదని, ఈ విషయంలో మోదీకి ఒక ‘విజన్’ అంటూ లేదని ఆయన ట్వీట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రీ కూడా ఇలాగే స్పందించారు. మొదట ఈ దేశానికి జీడీపీలో 8 నుంచి 10 శాతం విలువైన ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించాలని ఆయన ట్వీట్ చేశారు. లాక్ డౌన్ సందర్భంగా ఉపాధిలేక తమ స్వస్థలాల బాట పట్టిన వేలాది కార్మికులకు, శ్రామిక జీవులకు వెంటనే వేతనాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఇందుకు ప్రస్తుత చట్టాలు కూడా అనుమతిస్తున్నాయి అన్నారు. ‘ఫేక్ న్యూస్ ని అణచివేస్తున్నామన్న పేరిట రియల్ ప్రెస్ నోళ్లు నొక్కకండి’ అని మహువా తీవ్రంగా హెచ్చరించారు.