మధ్యప్రదేశ్.. శివరాజ్ సింగ్ చౌహాన్ కే మళ్ళీ సీఎం పీఠం ?

| Edited By: Pardhasaradhi Peri

Mar 23, 2020 | 5:42 PM

బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్ళీ ముఖ్యమంత్రి కానున్నారు. నాలుగోసారి ఆయన ఈ పీఠం ఎక్కబోతున్నారు.  గురువారం (ఈ నెల 19) నాటికి  కాంగ్రెస్ నేత కమల్ నాథ్ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ.. ఆ ఉత్తర్వులకు ముందే  ఆయన రాజీనామా చేశారు. జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుదారులైన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అధికారంలో కొనసాగడానికి తనకు తగినంత […]

మధ్యప్రదేశ్.. శివరాజ్ సింగ్ చౌహాన్ కే మళ్ళీ సీఎం పీఠం ?
Follow us on

బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్ళీ ముఖ్యమంత్రి కానున్నారు. నాలుగోసారి ఆయన ఈ పీఠం ఎక్కబోతున్నారు.  గురువారం (ఈ నెల 19) నాటికి  కాంగ్రెస్ నేత కమల్ నాథ్ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ.. ఆ ఉత్తర్వులకు ముందే  ఆయన రాజీనామా చేశారు. జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుదారులైన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అధికారంలో కొనసాగడానికి తనకు తగినంత మెజారిటీ లేదని భావించిన ఆయన రాజీనామా చేయక తప్పలేదు. కాగా…  రెబెల్ ఎమ్మెల్యేలంతా సింధియా సూచనపై బీజేపీలో చేరిన సంగతి విదితమే. తనకు మళ్ళీ అధికార పీఠం దక్కుతుందని ఆశించిన శివరాజ్ సింగ్ చౌహాన్ కల నెరవేరింది. ఢిల్లీలో జ్యోతిరాదిత్య సింధియాతో కలిస్ ఆయన జరిపిన ప్రయత్నాలు సఫలమయ్యాయి.