సీఏఏపై తగ్గని నిరసన సెగలు.. షిల్లాంగ్ ఉద్రిక్తం

| Edited By: Pardhasaradhi Peri

Mar 02, 2020 | 4:09 PM

సీఏఏకి వ్యతిరేకంగా మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. సదర్, లుమ్ డీన్గురి పోలీసు స్టేషన్ల పరిధిలోనూ, కంటోన్మెంట్ బీట్ హౌస్ వద్ద రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

సీఏఏపై తగ్గని నిరసన సెగలు.. షిల్లాంగ్ ఉద్రిక్తం
Follow us on

సీఏఏకి వ్యతిరేకంగా మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. సదర్, లుమ్ డీన్గురి పోలీసు స్టేషన్ల పరిధిలోనూ, కంటోన్మెంట్ బీట్ హౌస్ వద్ద రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోను, షిల్లాంగ్ లో సదా కిక్కిరిసి ఉండే మార్కెట్లోనూ రెండు విద్యార్ధి సంఘాలు ఘర్షణలకు దిగాయి.

ఇండో-బంగ్లా బోర్డర్ లో సైతం ఖాసీ స్టూడెంట్స్ యూనియన్, మరో విద్యార్ధి సంఘం తలపడ్డాయని, ఇది గిరిజనులు, గిరిజనేతర విద్యార్థుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆరు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసినప్పటికీ.. ప్రజలు శాంతి యుతంగా ఉండాలంటూ గవర్నర్ తథాగత్ రాయ్, సీఎం కోన్రాడ్ కె.సంగ్మా సోషల్ మీడియా ద్వారా కోరడం విశేషం. దాదాపు వారం రోజులపాటు ఢిల్లీ నగరంలో రేగిన హింస తగ్గుముఖం పట్టి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఈ ఈశాన్య రాష్ట్రంలో హింస తలెత్తడం విశేషం. ఢిల్లీ హింసలో మరణించిన వారి సంఖ్య 43 కి పెరిగిన సంగతి తెలిసిందే .