సీరం కంపెనీకి డ్రగ్స్ రెగ్యులేటర్ షో కాజ్ నోటీసు

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 6:57 PM

'కోవిషీల్డ్స్' వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేస్తున్న పూణే లోని సీరం ఇన్స్ టి ట్యూట్ ట్రబుల్స్ లో పడింది. ఈ వ్యాక్సీన్ ట్రయల్స్ లో ఈ సంస్థ ముందడుగు వేస్తున్నప్పటికీ.. ట్రయల్స్ ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రిటన్ లో దీనిని

సీరం కంపెనీకి డ్రగ్స్ రెగ్యులేటర్ షో కాజ్ నోటీసు
Follow us on

‘కోవిషీల్డ్స్’ వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేస్తున్న పూణే లోని సీరం ఇన్స్ టి ట్యూట్ ట్రబుల్స్ లో పడింది. ఈ వ్యాక్సీన్ ట్రయల్స్ లో ఈ సంస్థ ముందడుగు వేస్తున్నప్పటికీ.. ట్రయల్స్ ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రిటన్ లో దీనిని తీసుకున్న వాలంటీర్ (రోగి) కి ఈ విషయాన్ని ఎందుకు తెలియజేయలేదని డ్రగ్స్ రెగ్యులేటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ సంస్థకు షో కాజ్ నోటీసు జారీ చేసింది. సీరం కంపెనీ ఇండియాలో వచ్ఛే వారం నుంచి మూడో దశ ట్రయల్స్ ని ప్రారంభించనుంది. బ్రిటన్లోని ఈ రోగికి  సైడ్ ఎఫెక్ట్స్ సోకి అస్వస్థత పాలవడంతో నాలుగు దేశాల్లో ట్రయల్స్ ని నిలిపివేశారు. అయితే ఈ వ్యాక్సీన్ కి. ఆ పేషంట్ సైడ్ ఎఫెక్ట్స్ కి లింక్ ఉందా అన్న విషయం తేలాల్సి ఉంది.

ఈ రోగికి మీరు వివరణాత్మక రిపోర్టు ఎందుకు పంపలేదని డ్రగ్స్ రెగ్యులేటర్ సంస్థ సీరం కంపెనీని ప్రశ్నించింది. అయితే ఇండియాలో తమ ట్రయల్స్ కొనసాగుతున్నాయని, ఎలాంటి సమస్యలూ ఎదురుకాలేదని సీరం సంస్థ తెలిపింది. బ్రిటన్ ట్రయల్స్ పై తాము కామెంట్ చేయబోమని పేర్కొంది. ఇలా ఉండగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఈ వ్యాక్సీన్ ఉత్పత్తికి పూనుకొన్న బ్రిటిష్-స్వీడిష్ ఫార్మా.. ఆస్ట్రాజెనికా.. ఆ పేషంట్ అకస్మాత్తుగా అస్వస్థత పాలయ్యాడని. డ్రగ్ ట్రయల్స్ లో ఇలాంటివి మామూలేనని కొట్టి పారేసింది.