‘పోలీస్ గిరీ జాంతానై !’….ఇక పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు ! సుప్రీంకోర్టు రూలింగ్

| Edited By: Pardhasaradhi Peri

Sep 16, 2020 | 12:55 PM

పోలీసింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సెన్సిటివ్ గా చేసేందుకు సుప్రీంకోర్టు నడుం కటింది. ఇందులో భాగంగా దేశంలో ప్రతి పోలీసు స్టేషన్ లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటయ్యేలా చూడాలని అన్ని రాష్ట్రాలు

పోలీస్ గిరీ జాంతానై !....ఇక పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు ! సుప్రీంకోర్టు రూలింగ్
Follow us on

పోలీసింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సెన్సిటివ్ గా చేసేందుకు సుప్రీంకోర్టు నడుం కటింది. ఇందులో భాగంగా దేశంలో ప్రతి పోలీసు స్టేషన్ లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటయ్యేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించింది. ఇది చాలా ముఖ్యమైన చర్య అని, పౌరుల ప్రాథమిక హక్కులతో ఇది ముడిపడి ఉందని వ్యాఖ్యానించింది. అన్ని పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు, పోలీసు అధికారుల ముందు సాక్షులు ఇచ్ఛే స్టేట్ మెంట్ల ఆడియో వీడియో రికార్డింగుల ఏర్పాటుపై ఎంతవరకు పురోగతి జరిగిందో వివరించవలసిందిగా గత నెలలోనే అటార్నీ జనరల్కె.కె.వేణుగోపాల్ ను అత్యున్నత న్యాయస్థానం కోరింది. పంజాబ్ లోని ఓ కేసు నేపథ్యంలో కోర్టు ఈ సూచనలు చేసింది.