”నెమళ్లతో మోదీ బిజీ, మీ ప్రాణాలకు మీదే బాధ్యత’, రాహుల్ సెటైర్

| Edited By: Pardhasaradhi Peri

Sep 14, 2020 | 10:57 AM

ప్రధాని మోదీ 'నెమళ్లతో' గడుపుతూ  బిజీగా ఉన్నారని, అందువల్ల ఈ దేశ ప్రజలు తమ ప్రాణాలు తామే రక్షించుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో కరోనా వైరస్ కేసులు..

నెమళ్లతో మోదీ బిజీ, మీ ప్రాణాలకు మీదే బాధ్యత, రాహుల్ సెటైర్
Follow us on

ప్రధాని మోదీ ‘నెమళ్లతో’ గడుపుతూ  బిజీగా ఉన్నారని, అందువల్ల ఈ దేశ ప్రజలు తమ ప్రాణాలు తామే రక్షించుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో కరోనా వైరస్ కేసులు ఈ వారం 50 లక్షలకు పైగా పెరిగిపోతాయని, ఒక ప్లాన్ అంటూ లేని లాక్ డౌన్ ఒక వ్యక్తి ఇగో ఇఛ్చిన ‘గిఫ్ట్’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇదే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైందన్నారు. మోదీ ‘ఆత్మ నిర్భర్’ నినాదం అంటే మీ ప్రాణాలు మీరే రక్షించుకోండి అన్నదే అని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. మోదీ ఆ మధ్య తన నివాసంలో నెమళ్లకు ఆహారం వేస్తూ వాటితో గడిపిన వీడియోను రాహుల్ గుర్తు చేశారు. కాగా-తన తల్లి సోనియా గాంధీ వెంట ఆయన విదేశాలకు బయల్దేరి వెళ్లారు.  సోనియా విదేశాల్లో మెడికల్ చెకప్ చేయించుకోనున్నారు.