రష్యన్ కోవిడ్-19 వ్యాక్సీన్ కి ఇండియాలో ఆమోదం

| Edited By: Anil kumar poka

Oct 17, 2020 | 7:07 PM

రష్యాలో తయారైన కోవిడ్-19 వ్యాక్సీన్ 'స్పుత్నిక్' కి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ రెండూ..'రెన్యూ' చేసిన ఆమోదం పొందాయి. అంటే ఇండియాలో ఇక దీని క్లినికల్ ట్రయల్స్ కి మార్గం సుగమమైనట్టే..

రష్యన్ కోవిడ్-19 వ్యాక్సీన్ కి ఇండియాలో ఆమోదం
Coronavirus Vaccine
Follow us on

రష్యాలో తయారైన కోవిడ్-19 వ్యాక్సీన్ ‘స్పుత్నిక్’ కి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ రెండూ..’రెన్యూ’ చేసిన ఆమోదం పొందాయి. అంటే ఇండియాలో ఇక దీని క్లినికల్ ట్రయల్స్ కి మార్గం సుగమమైనట్టే..మొదట ఈ ఏడాది ఆరంభంలో రష్యాలో  తొలి, రెండో దశ ట్రయల్స్ చాలా పరిమితంగా జరిగాయని భావించిన భారత రెగ్యులేటర్లు ఈ ట్రయల్స్ కి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించకుండా తిప్పి పంపాయి. అయితే కొత్త ఒప్పందం ప్రకారం.. రెండు, మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ ని ఇక నిర్వహించనున్నారు. విదేశాల్లో దీన్ని మార్కెట్ చేస్తున్న రష్యన్ ఫండ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అగ్రిమెంట్ ప్రకారం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ క్లినికల్ ట్రయల్స్ ని నిర్వహించబోతోంది. అప్రూవల్ అనంతరం ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ కూడా చేయనుంది. రష్యన్ ఫండ్ మొదట 100 మిలియన్ డోసుల వ్యాక్సీన్ ని రెడ్డీస్ ల్యాబ్ కి ఇస్తుందని ఈ కంపెనీ వర్గాలు తెలిపాయి.