ఈ వారంలోనే అందుబాటు లోకి రష్యా వ్యాక్సీన్

| Edited By: Anil kumar poka

Sep 07, 2020 | 7:53 PM

తమ దేశంలో తయారు చేసిన కరోనా వైరస్ వ్యాక్సీన్ ఈ వారం నుంచే పబ్లిక్ లోకి అందుబాటులోకి వస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. 'స్పుత్నిక్-వి ' పేరిట ఈ వ్యాక్సీన్ ని అభివృధ్ది పరిచారు.

ఈ వారంలోనే అందుబాటు లోకి రష్యా వ్యాక్సీన్
Follow us on

తమ దేశంలో తయారు చేసిన కరోనా వైరస్ వ్యాక్సీన్ ఈ వారం నుంచే పబ్లిక్ లోకి అందుబాటులోకి వస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ‘స్పుత్నిక్-వి ‘ పేరిట ఈ వ్యాక్సీన్ ని అభివృధ్ది పరిచారు. గత ఆగస్టు 1 న పుతిన్ దీన్ని లాంచ్ చేశారు. రష్యా ఆరోగ్య శాఖ నుంచి  అనుమతి లభించిన వెంటనే ఇది ఇతర ప్రపంచ దేశాల్లోకి ‘అడుగు పెట్టవచ్ఛు.  ‘గమాలేయా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎపిడెర్మాలజీ, మైక్రో బయాలజీ సంస్థ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంయుక్తంగా ఈ వ్యాక్సీన్ ని తయారు చేశాయి. దీన్ని స్వయంగా తన కూతురికి ఇఛ్చినట్టు ప్రకటించి పుతిన్ సంచలనం రేపారు.

అయితే రష్యా తన వ్యాక్సీన్ కి సంబంధించిన ట్రయల్స్ ని రహస్యంగా ఉంచిందని, చాలా తక్కువమంది వలంటీర్లపై వాటిని నిర్వహించిందని విమర్శలు వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రష్యా వైఖరిపై సందేహాలను లేవనెత్తింది. రష్యాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు.