‘ఆత్మనిర్భర్’ అంటే ఏమిటో రష్యా చూపింది’, సంజయ్ రౌత్

| Edited By: Pardhasaradhi Peri

Aug 16, 2020 | 7:46 PM

ఆత్మ నిర్భర్ (స్వావలంబన)అంటే ఏమిటో రష్యా చూపిందని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. తొలి కరోనా వైరస్  వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేసి ప్రపంచానికి మొట్టమొదటి పాఠాన్ని నేర్పిందని..

ఆత్మనిర్భర్ అంటే ఏమిటో రష్యా చూపింది, సంజయ్ రౌత్
Follow us on

ఆత్మ నిర్భర్ (స్వావలంబన)అంటే ఏమిటో రష్యా చూపిందని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. తొలి కరోనా వైరస్  వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేసి ప్రపంచానికి మొట్టమొదటి పాఠాన్ని నేర్పిందని ఆయన పేర్కొన్నారు. కానీ మన దేశంలో కేవలం ఈ నినాదం మాత్రమే వినిపిస్తోందని పరోక్షంగా కేంద్రాన్ని ఆయన విమర్శించారు. రష్యన్ వ్యాక్సీన్ ఇల్లీగల్ అని నిరూపించడానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఉవ్విళ్ళూరుతున్నాయని, కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా తన కూతురికి ఈ వ్యాక్సీన్ ఇఛ్చి ఆత్మవిశ్వాసం అంటే ఇదేనని ప్రూవ్ చేశారని రౌత్ అన్నారు.

మన దేశం మాత్రం స్వావలంబన అంటూ మాటల్లోనే ఊదరగొడుతోందని సంజయ్ రౌత్ విమర్శించారు. కాగా-రష్యా చెబుతున్న వ్యాక్సీన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పలువురు నిపుణులు ఈ వ్యాక్సీన్ పట్ల సందేహాలను ఇంకా లేవనెత్తుతున్నారు.