రాజ్యసభలో విపక్షాల రగడ ఇదిగో, వీడియో రిలీజ్ చేసిన సర్కార్

| Edited By: Pardhasaradhi Peri

Sep 21, 2020 | 8:21 PM

వ్యవసాయ బిల్లులపై ఆదివారం రాజ్యసభలో విపక్షాల రగడ తాలూకు వీడియోను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణను ఎదుర్కొనేందుకు..

రాజ్యసభలో విపక్షాల రగడ ఇదిగో, వీడియో రిలీజ్ చేసిన సర్కార్
Follow us on

వ్యవసాయ బిల్లులపై ఆదివారం రాజ్యసభలో విపక్షాల రగడ తాలూకు వీడియోను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణను ఎదుర్కొనేందుకు ఈ సీసీటీవీ ఫుటేజీని విడుదల చేస్తున్నామని పేర్కొంది. ఇందులో ప్రతిపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకుపోవడాన్ని, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చేతిలోని పత్రాలను లాక్కోవడానికి యత్నించడాన్ని ప్రభుత్వ వర్గాలు చూపాయి. కొందరు సభ్యులు టేబుల్స్ పైకి ఎక్కి నినాదాలు  చేయడం చూడడండని తెలిపింది. ఈ వీడియోలో ఇలా ప్రవర్తిస్తున్నవారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ , ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులని వివరించారు. కొందరు మైక్ లను లాగివేస్తుండడాన్ని కూడా ఈ వీడియోలో చూపారు. మొత్తం సభ అంతా ఎంత గందరగోళంలో మునిగిందో కళ్లారా చూడాలని ప్రభుత్వం పేర్కొంది.