రియా చక్రవర్తి బెంగాలీ బ్రాహ్మిన్, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి

| Edited By: Anil kumar poka

Sep 10, 2020 | 11:30 AM

సుశాంత్ కేసులో అరెస్టయిన రియాచక్రవర్తి బెంగాలీ బ్రాహ్మణ యువతి అని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఆమె డ్రగ్స్ తీసుకునేదనే ఆరోపణలను ఆయన దాదాపు ఖండించారు.

రియా చక్రవర్తి బెంగాలీ బ్రాహ్మిన్, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి
Follow us on

సుశాంత్ కేసులో అరెస్టయిన రియాచక్రవర్తి బెంగాలీ బ్రాహ్మణ యువతి అని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఆమె డ్రగ్స్ తీసుకునేదనే ఆరోపణలను ఆయన దాదాపు ఖండించారు. సుశాంత్ కేసులో రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. సుశాంత్ ను బీహారీ నటుడిగా చూపడానికి నానా పాట్లూ పడుతోందన్నారు. రియా తండ్రి మాజీ సైనికాధికారి అని, దేశానికి సేవ చేసినవారని అధిర్ రంజన్ పేర్కొన్నారు. బీహార్ బీజేపీ శాఖ..’జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్’ అంటూ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ కొత్త రకం రాజకీయ ఎత్తుగడలను అంతా ఖండించాలని అధిర్ రంజన్ కోరారు. రానున్న బీహార్ ఎన్నికలను పురస్కరించుకుని బీజేపీ ఈ నాటకాలాడుతోందన్నారు.