సుశాంత్ కేసులో మరో కోణం, డ్రగ్ డీలర్ తో రియాకు లింక్ ?

| Edited By: Pardhasaradhi Peri

Aug 26, 2020 | 6:20 PM

సుశాంత్ కేసులో 'తవ్వేకొద్దీ' కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అతనికి ఇచ్ఛే టీ, కాఫీ, చివరకు మంచినీటిలో సైతం 'సీబీడీ ఆయిల్' అనే డ్రగ్ ని కలిపి ఇచ్ఛేదన్న వార్తలు..

సుశాంత్ కేసులో మరో కోణం, డ్రగ్ డీలర్ తో రియాకు లింక్ ?
Follow us on

సుశాంత్ కేసులో ‘తవ్వేకొద్దీ’ కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అతనికి ఇచ్ఛే టీ, కాఫీ, చివరకు మంచినీటిలో సైతం ‘సీబీడీ ఆయిల్’ అనే డ్రగ్ ని కలిపి ఇచ్ఛేదన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. గౌరవ్ ఆర్య అనే డ్రగ్ డీలర్ తో ఆమెవాట్సాప్ చాట్ చేసేదని తెలుస్తోంది. ఈ చాట్ ను డిలీట్ చేసినప్పటికీ మళ్ళీ ‘పునరుధ్దరించారని’, వారిద్దరి మధ్య ఈ డ్రగ్ గురించి కొంతసేపు చాటింగ్ జరిగిందని సమాచారం. ఇలా రియా డ్రగ్ కుట్ర మెల్లమెల్లగా బయటపడుతున్న తరుణంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ రాకేష్ ఆస్తానా తమ శాఖలోని ఆపరేషన్స్ టీమ్ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రాతో భేటీ అయ్యారు. రియాను ప్రశ్నించేందుకు ఈ సంస్థ ఆమెపై ‘క్రైమ్ నెంబర్ ఫస్ట్’ గా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈడీ దర్యాప్తులోనే రియా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. రియా ఫోన్ చాటింగ్ ను పరిశీలించేందుకు సీబీఐ కూడా ఈడీతో చేతులు కలపవచ్చు. మరోవైపు సీబీఐ అధికారులు మళ్ళీ మళ్ళీ సిద్దార్థ్ పితానిని, సుశాంత్ ఇంటి కుక్ నీరజ్ ని, హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరందాని, స్టాఫ్ దీపేష్ సావంత్ ని కూడా ఇంటరాగేట్ చేయవచ్చు. ,