ట్రయల్స్ లో విఫలం.. ఆ మందు మంచిది కాదా ?

| Edited By: Anil kumar poka

Apr 24, 2020 | 10:54 AM

చైనా, అమెరికా వంటి దేశాల్లో కరోనా రోగుల చికిత్సలో వాడుతున్న 'రెమ్ డెసివిర్' మందు క్లినికల్ ట్రయల్స్ లో విఫలమైందట. దీని ఫలితాలు చూసి రీసెర్చర్లు షాక్ తిన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వెబ్ సైట్ లో దీనికి సంబంధించి ఓ ముసాయిదా సమ్మరీని పబ్లిష్ చేసింది....

ట్రయల్స్ లో విఫలం.. ఆ మందు మంచిది కాదా ?
Follow us on

చైనా, అమెరికా వంటి దేశాల్లో కరోనా రోగుల చికిత్సలో వాడుతున్న ‘రెమ్ డెసివిర్’ మందు క్లినికల్ ట్రయల్స్ లో విఫలమైందట. దీని ఫలితాలు చూసి రీసెర్చర్లు షాక్ తిన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వెబ్ సైట్ లో దీనికి సంబంధించి ఓ ముసాయిదా సమ్మరీని పబ్లిష్ చేసింది.  ఫైనాన్షియల్ టైమ్స్, స్టేట్..  ఈ రెండూ మొట్టమొదట ఈ షాకింగ్ అంశాన్ని రిపోర్ట్ చేశాయి. ఈ మందును ఉత్పత్తి చేస్తున్న ‘గిలీడ్ సైన్సెస్’ సంస్థ మాత్రం ఈ ఫలితాలను కొట్టిపారేసింది. ఈ డేటా ఏదో ప్రయోజనాన్ని ఆశించి సేకరించిందే అయి ఉంటుందని ఈ కంపెనీ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.  చైనాలో ఈ మెడిసిన్ ని 237 మంది రోగులపై పరీక్షించారు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా 18 మంది రోగులకు ఇవ్వడం నిలిపివేశారు. నెల రోజుల అనంతరం కంట్రోల్ గ్రూప్ లోని 12. 8 శాతం రోగులతో పోలిస్తే.. ఈ మందును తీసుకున్న రోగుల్లో 13. 9 శాతం మంది మృతి చెందారు. ఏమైనా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్ సైట్ లో వఛ్చిన డేటా  అర్థవంతంగా లేదని, ఈ స్టడీ అసంపూర్తిగా ఉందని గిలీడ్ సైన్సెస్ ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ మెడిసిన్ బదులు తమ దేశంలోని  కరోనా రోగుల కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్ మందునే కావాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మెడిసిన్ కోసం పట్టుబట్టి ఆయన ఇండియా నుంచి తెప్పించుకున్నారు.