కరోనాపై నిర్లక్ష్యం తగదు.. మమతకు ఎన్నారై డాక్టర్ లేఖ

| Edited By: Anil kumar poka

May 12, 2020 | 11:11 AM

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తో కూడుకున్నదని, అత్యంత ప్రమాదకరమైనదని ఓ ప్రముఖ ఇండియన్ అమెరికన్ కార్డియాలజిస్ట్ పేర్కొన్నారు. అందువల్ల దీనిపై నిర్లక్ష్యం తగదని, అన్ని ప్రధాన చర్యలు తీసుకోవాలని...

కరోనాపై నిర్లక్ష్యం తగదు.. మమతకు ఎన్నారై డాక్టర్ లేఖ
Follow us on

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తో కూడుకున్నదని, అత్యంత ప్రమాదకరమైనదని ఓ ప్రముఖ ఇండియన్ అమెరికన్ కార్డియాలజిస్ట్ పేర్కొన్నారు. అందువల్ల దీనిపై నిర్లక్ష్యం తగదని, అన్ని ప్రధాన చర్యలు తీసుకోవాలని ఆయన బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రాసిన లేఖలో కోరారు. టెనెస్ వాసి అయిన డాక్టర్ ఇంద్ర నీల్ బసు రే అనే ఈయన.. ఈ మేరకు హెచ్చరిస్తూ.. బెంగాల్ సహా ఇండియా ఒక రకంగా అదృష్టవంత దేశమని, మరీ తీవ్రతతో కూడిన వైరల్ ఇన్ఫెక్షన్ లేకపోవడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ లో జనం రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఇది ఒక లొకాలిటీని తాకితే కార్చిచ్చులా పాకిపోతుందని ఆయన అన్నారు. ఉదాహరణకు అమెరికా, రష్యా, బ్రిటన్ వంటి దేశాలను ఇంద్రనీల్ బసు గుర్తు చేశారు. ఆ దేశాల్లో వేలాది మంది ఈ వైరస్ కి గురై, ప్రాణాలను కోల్పోతున్నారని పేర్కొన్నారు. అందువల్లే ఖఛ్చితంగా భౌతిక దూరం పాటించాలని, దీన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని మళ్ళీ మళ్ళీ సూచించిన ఆయన.. దీన్ని ‘కిల్లింగ్ మెషిన్’ గా అభివర్ణించారు. టెస్టింగ్స్ ఎక్కువగా చేయాలి.. సమూహాలు లేకుండా చూడాలి.. లాక్ డౌన్ అమలు ఖఛ్చితంగా జరిగేలా చూడాలి అని ఆయన సలహా ఇఛ్చారు. బెంగాల్ కు చెందిన ఈయన రాసిన ఈ లేఖపై మమతా బెనర్జీ ఎలా స్పనందిస్తారో చూడాలి !

పశ్చిమ బెంగాల్ లో 1939 కరోనా కేసులు నమోదు కాగా 118 మంది రోగులు మరణించారు. ఇండియాలో తాజాగా ఈ కేసుల సంఖ్య 67,152 కి చేరుకుంది. గత 24 గంటల్లో 4,213 కేసులు నమోదు కాగా ..మృతుల సంఖ్య 2,206 కి పెరిగింది.