రేపట్నుంచి సందర్శకుల కోసం మొఘల్‌గార్డెన్స్‌ .

|

Feb 04, 2020 | 8:24 PM

రాష్ర్టపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్‌ సందర్శకులకు కనువిందు చేయడానికి రెడీ అయ్యింది… సుమారు పదివేల తులిప్‌పూల్‌.. 138 రకాల గులాబీలు.. వివిధ రకాలకు చెందిన విరులతో మొఘల్‌ గార్డెన్‌ ముస్తాబయ్యింది.. ఈ పూదోటలో సందర్శకులను రేపటి నుంచి వచ్చే నెల ఎనిమిది వరకు అనుమతిస్తారు.. రాష్ర్టపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ప్రారంభమైన ఉద్యానోత్సవ్‌ నెల రోజుల పాటు సందర్శకులకు ఉత్సాహాన్ని ఇవ్వనుంది.. ప్రతి సంవత్సరం జరిగే ఈ పూల ఉత్సవానికి సందర్శకుల తాడికి ఎక్కువగా ఉంటుంది. […]

రేపట్నుంచి సందర్శకుల కోసం మొఘల్‌గార్డెన్స్‌ .
Follow us on

రాష్ర్టపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్‌ సందర్శకులకు కనువిందు చేయడానికి రెడీ అయ్యింది… సుమారు పదివేల తులిప్‌పూల్‌.. 138 రకాల గులాబీలు.. వివిధ రకాలకు చెందిన విరులతో మొఘల్‌ గార్డెన్‌ ముస్తాబయ్యింది.. ఈ పూదోటలో సందర్శకులను రేపటి నుంచి వచ్చే నెల ఎనిమిది వరకు అనుమతిస్తారు.. రాష్ర్టపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ప్రారంభమైన ఉద్యానోత్సవ్‌ నెల రోజుల పాటు సందర్శకులకు ఉత్సాహాన్ని ఇవ్వనుంది.. ప్రతి సంవత్సరం జరిగే ఈ పూల ఉత్సవానికి సందర్శకుల తాడికి ఎక్కువగా ఉంటుంది.

ప్రతి ఏడాది రకరకాల కొత్త పూలతో గార్డెన్‌ను అలంకరిస్తారు.. గులాబీలను అయితే మరింత ప్రత్యేకంగా రూపొందించారు.. గులాబీలకు చారిత్రక వ్యక్తుల పేర్లు పెట్టారు.. మొఘల్‌గార్డెన్స్‌లో జవహర్‌లాల్‌ నెహ్రు, ప్రణబ్‌ ముఖర్జీ, మదర్‌ థెరిసా, జాన్‌ ఎఫ్‌ కెనడీ, క్వీన్‌ ఎలిజబెత్‌ పేర్లతో ఉన్న గులాబీలు ప్రత్యేకం… ఓ గులాబీకి మొనాకో రాజకుమారుడి పేరు కూడా పెట్టారు. ఆకుపచ్చ రంగులో ఉన్న గులాబీ పువ్వును కూడా ఇక్కడ మనం చూడొచ్చు.. లాస్టియర్‌ సుమారు అయిదున్నర లక్షల మంది సందర్శకులు మొఘల్‌ గార్డెన్స్‌ను సందర్శించారు. ప్రతి రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సందర్శకుల కోసం ఉద్యానవనం తెరచి వుంటుంది.. ప్రవేశం ఉచితం.. 380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గార్డెన్‌లో ఆధ్యాత్మక పూదోట.. హెర్బల్‌ తోట.. బొన్సాయి గార్డెన్‌.. మ్యూజికల్‌ గార్డెన్‌లు ప్రత్యేకంగా ఉన్నాయి..