రామ్ విలాస్ పాశ్వాన్ మృతితో చిరాగ్ పాశ్వాన్ కు ‘కష్టాలు’ !

| Edited By: Anil kumar poka

Oct 09, 2020 | 11:55 AM

రామ్ విలాస్ పాశ్వాన్ మృతితో బీహార్ ఎన్నికల్లో ఆయన కుమారుడు. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కు కష్టాలు తప్పేలా లేవు. . ఈ నెల 28 న మొదటి దశ ఎన్నికల్లోనే చిరాగ్ పార్టీ....

రామ్ విలాస్ పాశ్వాన్ మృతితో చిరాగ్ పాశ్వాన్ కు కష్టాలు !
Follow us on

రామ్ విలాస్ పాశ్వాన్ మృతితో బీహార్ ఎన్నికల్లో ఆయన కుమారుడు. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కు కష్టాలు తప్పేలా లేవు. . ఈ నెల 28 న మొదటి దశ ఎన్నికల్లోనే చిరాగ్ పార్టీ ఎక్కువ స్థానాలకు  పోటీ చేస్తోంది. ఈ ఎలెక్షన్స్ లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి చిరాగ్ అధ్యక్షుడైనప్పటికీ ఎల్ జేపీని బీహార్ ఓటర్లు ఇంకా రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీగానే పరిగణిస్తున్నారు. 1990 నుంచే రాష్ట్రంలో రామ్ విలాస్ పాశ్వాన్ బలమైన దళిత నేతగా పాపులర్ అయ్యారు. హాజీపూర్ లోక్ సభ నియోజకవర్గ ఎన్నికల్లో ఆయన విజయం రికార్డులు సృష్టించింది. కానీ తండ్రికి ఉన్నంత పాపులారిటీ చిరాగ్ పాశ్వాన్ కు లేదు. కొన్ని ర్యాలీల్లో ఆయన పాల్గొన్నప్పటికీ వాటికి హాజరైనవారి సంఖ్య వెయ్యి మంది లోపే.. తన పార్టీ ఎన్నికల ప్రచారంలో చిరాగ్ ఎలా నెట్టుకొస్తారో చూడాల్సి ఉంది.