చైనాపై మౌనం, టైటానిక్ నౌక ముక్కలు కావడం వంటిదే, రాహుల్

| Edited By: Pardhasaradhi Peri

Sep 08, 2020 | 5:47 PM

చైనా ఓ వైపు మన దేశంలో ఆక్రమణలకు దిగుతుండగా మరో వైపు ప్రధాని మోదీ మౌనంగా ఉండడం. అలాంటిదేమీ లేదంటూ తిరస్కరించడం చూస్తే ఇది . ఓ కొండను ఢీ కొన్న టైటానిక్ నౌక ముక్కలు కావడం వంటిదేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.

చైనాపై మౌనం, టైటానిక్ నౌక ముక్కలు కావడం వంటిదే, రాహుల్
Follow us on

చైనా ఓ వైపు మన దేశంలో ఆక్రమణలకు దిగుతుండగా మరో వైపు ప్రధాని మోదీ మౌనంగా ఉండడం. అలాంటిదేమీ లేదంటూ తిరస్కరించడం చూస్తే ఇది . ఓ కొండను ఢీ కొన్న టైటానిక్ నౌక ముక్కలు కావడం వంటిదేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అసలు ఆక్రమణలే జరగడంలేదని ప్రభుత్వం చెప్పడం  దేశాన్ని టైటానిక్ పరిస్థితిలోకి నెట్టినట్టే అన్నారాయన..కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన మంగళవారం పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో మాట్లాడిన రాహుల్..మోదీ సర్కార్ పై నిప్పులు కక్కారు. ప్రధాని, మీడియా కూడా ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని  మీడియాను కూడా ఆయన తప్పు పట్టారు. సమస్యను ఒక పాయింట్ దాటి దాచలేరు అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని, చైనా ఆక్రమణలు, క్షీణిస్తున్న ఎకానమీ ఇవన్నీ టైటానిక్ షిప్ ఘటనను గుర్తు చేస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. పార్లమెంటులో ఇలాంటి అంశాలను లేవనెత్తాల్సిన అవసరం ఉందన్నారు.

కాగా-ప్రభుత్వం జారీ చేసిన 11 ఆర్డినెన్సుల్లో నాలుగింటిని తోసిపుచ్చాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్లమెంటులో జీరో అవర్ సమయాన్ని పెంచాలని డిమాండ్ చేసింది. పార్టీ ప్రస్తావించిన అంశాలను ‘అసమ్మతివాదులు’గా ముద్ర పడిన నేతలు కూడా అంగీకరించారు.