188 ఐపీసీ సెక్షన్ కింద రాహుల్ ప్రభృతుల అరెస్ట్

| Edited By: Pardhasaradhi Peri

Oct 01, 2020 | 5:25 PM

యూపీలోని హత్రాస్ జిల్లాకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ తదితరులను నోయిడా పోలీసులు 188 ఐపీసీ సెక్షన్ కింద అరెస్టు చేశారు. ఎపిడమిక్ యాక్ట్ ఉల్లంఘన  కింద వీరిని అదుపులోకి..

188 ఐపీసీ సెక్షన్ కింద రాహుల్ ప్రభృతుల అరెస్ట్
Follow us on

యూపీలోని హత్రాస్ జిల్లాకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ తదితరులను నోయిడా పోలీసులు 188 ఐపీసీ సెక్షన్ కింద అరెస్టు చేశారు. ఎపిడమిక్ యాక్ట్ ఉల్లంఘన  కింద వీరిని అదుపులోకి తీసుకున్నట్టు వారు తెలిపారు.  వీరినిక ముందుకు వెళ్లనివ్వబోమన్నారు. రాహుల్, ప్రియాంక సహా పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో రణవీర్ సింగ్ సూర్జేవాలా, అధిర్ రంజన్ చౌదరి, కె.సి.వేణుగోపాల్ ప్రభృతులున్నారు. వీరిని ఖాకీలు ఇంటర్నేషనల్ బుధ్ సర్క్యూట్ హౌస్ కి తరలించారు. రాహుల్ తదితరుల అరెస్టు ఎన్సీపీ నేత శరద్ పవార్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా వెళ్తున్నవారిపట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఇది పోలీసు జులుం కాక మరేమిటన్నారు.