పంజాబ్ భారత అంతర్భాగమే, బ్రిటన్ క్లారిటీ

| Edited By: Pardhasaradhi Peri

Jul 30, 2020 | 3:23 PM

పంజాబ్ రాష్ట్రం భారత అంతర్భాగమేనని బ్రిటన్ స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాన్ని దేశం నుంచి వేరు చేయాలన్న ఖలిస్తానీ తీవ్రవాద బృందం డిమాండును తోసిపుచ్చింది. 'సిక్స్ ఫర్ జస్టిస్ రెఫరెండం-2020'పేరిట ఏర్పడిన ఈ తీవ్రవాద బృందం...

పంజాబ్ భారత అంతర్భాగమే, బ్రిటన్ క్లారిటీ
Follow us on

పంజాబ్ రాష్ట్రం భారత అంతర్భాగమేనని బ్రిటన్ స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాన్ని దేశం నుంచి వేరు చేయాలన్న ఖలిస్తానీ తీవ్రవాద బృందం డిమాండును తోసిపుచ్చింది. ‘సిక్స్ ఫర్ జస్టిస్ రెఫరెండం-2020’పేరిట ఏర్పడిన ఈ తీవ్రవాద బృందం.. పంజాబ్ ను ఇండియానుంచి వేరు చేయాలని,  ఇందుకు రెఫరెండం నిర్వహించాలని కోరుతోంది. తమ డిమాండును పాకిస్థాన్ కూడా అంగీకరించినట్టు పేర్కొంది. అయితే ఇది భారత ప్రజలకు, ప్రభుత్వానికి సంబంధించినదని, రెఫరెండం నిర్వహించాలన్న అనధికారిక డిమాండుకు తమ మద్దతు ఉండబోదని బ్రిటన్ హైకమిషన్ అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు. ఇండియన్ పంజాబ్ అన్నది పూర్తిగా ఇండియాలో భాగమే అన్నరాజు.

అటు కెనడా ప్రభుత్వం కూడా ఖలిస్తానీ తీవ్రవాదుల కోర్కెను తిరస్కరించింది. వీరి డిమాండ్  సమంజసం కాదని కెనడా అధికారులు సైతం కొట్టి పారేశారు.