‘నేను సైతం’.. ప్రధాని మోదీ పిలుపునకు స్పందించిన ప్రియాంక

| Edited By: Pardhasaradhi Peri

Mar 23, 2020 | 4:07 PM

ప్రపంచ దేశాలను మహమ్మారిలా పట్టి పీడిస్తున్న కరోనా నివారణకు  దేశ ప్రజలంతా ఒక్కరోజు తమకు తాము స్వచ్ఛందంగా కర్ఫ్యూను పాటించాలని., ఆదివారం ఉదయం ఏడు గంటల

నేను సైతం.. ప్రధాని మోదీ పిలుపునకు స్పందించిన ప్రియాంక
Follow us on

ప్రపంచ దేశాలను మహమ్మారిలా పట్టి పీడిస్తున్న కరోనా నివారణకు  దేశ ప్రజలంతా ఒక్కరోజు తమకు తాము స్వచ్ఛందంగా కర్ఫ్యూను పాటించాలని., ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలవరకు తమకు తాము ( జనతా) కర్ఫ్యూ విధించుకోవాలని ప్రధాని మోదీ ఇఛ్చిన పిలుపునకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా స్పందించారు. కరోనా రోగులకు డాక్టర్లు, నర్సులు అందిస్తున్న  సేవలకు గాను ప్రజలంతా సాయంత్రం అయిదు గంటలకు తమ బాల్కనీలో నిలబడి చప్పట్లు కొట్టి వారికి  అభినందనలు తెలపాలని ఆయన సూచించారు.దీనిపై ప్రియాంక తన దేశాభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం తన భర్త నిక్ జోనాస్ తో కలిసి అమెరికాలోని లాస్ ఏంజిలిస్ లో ఉంటున్న ఆమె ఆదివారం తన ఇంటి బాల్కనీలో నిలబడి చప్పట్లు కొట్టారు. ఇండియాలో నేను లేకున్నా.. ఈ రోజు ఈ ప్రశంసా కార్యక్రమంలో పాల్గొంటున్నా.. ‘జనతా కర్ఫ్యూ’ ఇండియా అని ఆమె తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది.. కరోనా రోగులకు చేస్తున్న సేవలు అమోఘమని, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె అన్నారు. ప్రియాంక తాను కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఇండియన్ అయిన తనకు దేశమంటే ఎంతో అభిమానం, ప్రేమ అని ఆమె నిరూపించుకున్నారు.