ఏనుగు నోటిలో పేలిన క్రాకర్స్..చివరకు… ?

| Edited By: Pardhasaradhi Peri

Jun 02, 2020 | 6:53 PM

జంతు హింసకు ఓ మూగ జీవి బలైపోయింది. దారుణంగా గాయపడి మరణించింది. కేరళ లోని మళప్పురం సమీపంలోని గ్రామంలో జరిగిన అమానుష ఘటన ఇది.. గర్భంతో ఉన్న ఓ ఏనుగు ఆహారం కోసం అడవి నుంచి ఈ గ్రామంలో ప్రవేశించింది. అక్కడి స్థానికులు కొందరు దానితో ‘ఆటవిక క్రీడ’ ఆడాలనుకుని.. క్రాకర్స్ (టపాకాయలు) నింపిన పైన్ యాపిల్ తినిపించారు. కొద్దిసేపటికే ఈ ఏనుగు నోటిలో క్రాకర్స్ పేలిపోవడంతో అది తీవ్రంగా గాయపడింది. బాధతో గ్రామమంతా పరుగులు తీసినా […]

ఏనుగు నోటిలో పేలిన క్రాకర్స్..చివరకు... ?
Follow us on

జంతు హింసకు ఓ మూగ జీవి బలైపోయింది. దారుణంగా గాయపడి మరణించింది. కేరళ లోని మళప్పురం సమీపంలోని గ్రామంలో జరిగిన అమానుష ఘటన ఇది.. గర్భంతో ఉన్న ఓ ఏనుగు ఆహారం కోసం అడవి నుంచి ఈ గ్రామంలో ప్రవేశించింది. అక్కడి స్థానికులు కొందరు దానితో ‘ఆటవిక క్రీడ’ ఆడాలనుకుని.. క్రాకర్స్ (టపాకాయలు) నింపిన పైన్ యాపిల్ తినిపించారు. కొద్దిసేపటికే ఈ ఏనుగు నోటిలో క్రాకర్స్ పేలిపోవడంతో అది తీవ్రంగా గాయపడింది. బాధతో గ్రామమంతా పరుగులు తీసినా అది ఎవరినీ గాయపరచలేదని, చివరకు వెల్లియార్ నదిలో దిగి తన బాధను తగ్గించుకోవడానికి ప్రయత్నించిందని సోషల్ మీడియాలో ఈ ఉదంతాన్ని ప్రస్తావించిన అటవీ అధికారి మోహన్ కృష్ణన్ పేర్కొన్నారు. నీటిలోనుంచి దీన్ని బయటకు తరలించేందుకు తాము మరో రెండు గజరాజులను తీసుకువఛ్చినప్పటికీ.. ఫలితం లేకపోయిందని, నీటిలోనే అది నిలబడి ప్రాణాలు వదిలిందని ఆయన తెలిపారు. భారమైన హృదయంతో ఈ ఏనుగుకు తామే అంతిమ సంస్కారాన్ని నిర్వహించామన్నారు.