జాయ్ రైడ్ కాస్తా గుంజీలకు దారి తీసింది !

| Edited By: Anil kumar poka

Apr 26, 2020 | 1:44 PM

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సరదాగా తన రెండు సీట్ల పోర్ష్ కారులో జాయ్ రైడ్ చేస్తున్న ఓ యువకుడు ఇట్టే భద్రతా అధికారులకు పట్టుబడిపోయాడు. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ఎలాంటి ట్రాఫిక్ లేని రోడ్ల మీద ఇతగాడు రయ్యిమని దూసుకుపోతూ వారికి దొరికిపోయాడు.

జాయ్ రైడ్ కాస్తా గుంజీలకు దారి తీసింది !
Follow us on

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సరదాగా తన రెండు సీట్ల పోర్ష్ కారులో జాయ్ రైడ్ చేస్తున్న ఓ యువకుడు ఇట్టే భద్రతా అధికారులకు పట్టుబడిపోయాడు. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ఎలాంటి ట్రాఫిక్ లేని రోడ్ల మీద ఇతగాడు రయ్యిమని దూసుకుపోతూ వారికి దొరికిపోయాడు. కనీసం ఫేస్ మాస్కు కూడా లేని ఇతని కారును ఆపిన అధికారులు అన్నీ చెక్ చేశారు. లాక్ డౌన్ అమల్లో ఉండగా బయటకు ఎందుకు వచ్చావని నిలదీశారు. కానీ వారి ప్రశ్నలకు ఈ యువకుడు సరైన జవాబులు చెప్పలేకపోవడంతో.. వారు అతని చేత గుంజీలు తీయించారు. చెవులు చేత బట్టుకుని ఈ ఉల్లంఘనుడు అలా చేయక తప్పింది కాదు.. ఇతని తండ్రి సిటీలో పేరుమోసిన దీపక్ దర్యానీ అనే బిజినెస్ మన్ అని తెలిసింది. ఇండోర్ లో లాక్ డౌన్ అమలులో పోలీసులకు సాధారణ పౌరులు, మాజీ సైనికులు కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు మనవాడిని ఆపినవారు అలాంటి వ్యక్తుల్లో ఒకరు కావడంతో అతని మీద దీపక్ దర్యానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి తన కొడుకు పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఆయన ఆరోపించారు. తన కుమారుడి వద్ద కర్ఫ్యూ పాస్, డ్రైవింగ్ లైసెన్స్ తదితరాలు అన్నీ ఉన్నా ఇలా ‘మహాపచారం’ చేశారని ఆ వ్యాపారవేత్త అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.