సవాల్ చేస్తున్నవారికి గట్టి బుద్ధి చెబుతున్నాం, ప్రధాని మోదీ

| Edited By: Anil kumar poka

Aug 15, 2020 | 10:23 AM

ఇండియాను సవాల్ చేస్తున్నవారికి గట్టి బుధ్ది చెబుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదం గానీ, తీవ్రవాదం గానీ భారత్ రెండింటితోనూ పోరాడుతోందన్నారు.

సవాల్ చేస్తున్నవారికి గట్టి బుద్ధి చెబుతున్నాం, ప్రధాని మోదీ
Follow us on

ఇండియాను సవాల్ చేస్తున్నవారికి గట్టి బుధ్ది చెబుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదం గానీ, తీవ్రవాదం గానీ భారత్ రెండింటితోనూ పోరాడుతోందన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ఎర్రకోటపై నుంచి దేశప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్ నుంచి లడాఖ్ వరకు ఈ పోరాటం సాగుతోందని, మన సైనికులు తమకు తెలిసిన ‘భాష’లో దీటైన సవాల్ ఇచ్చారని పరోక్షంగా పాకిస్తాన్ , చైనా దేశాలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. భారత సార్వభౌమాధికారాన్ని ఎవరూ సవాల్ చేయలేరన్నారు. లడఖ్ లో జూన్ ఏం జరిగిందో అందరికీ తెలుసు .. ఆ రోజున దేశంకోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నా అన్నారు.

ప్రపంచం ఇండియా వైపే ఉందని, ఐరాస భద్రతా మండలిలో 192 దేశాలకు గాను 184 దేశాల ఓట్లను మనం సాధించగలిగామని మోదీ అన్నారు. కరోనా వైరస్ వ్యాక్సీన్ ఉత్పత్తి వివిధ దశల్లో ఉందని, త్వరలో దేశ వ్యాప్తంగా దాని పంపిణీకి రోడ్ మ్యాప్ వేస్తున్నామని ఆయన చెప్పారు. ఇంకా ఆత్మ నిర్భర్, వోకల్ ఫర్ లోకల్ అన్న నినాదాలను ఆయన ప్రస్తావించారు. మొత్తం గంటా 26 నిముషాలసేపు ఆయన ప్రసంగించారు.