దేశవ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బందితో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, బ్లాక్ ఫంగస్ అదుపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన

| Edited By: Anil kumar poka

May 17, 2021 | 10:54 PM

దేశంలో కోవిడ్ పరిస్థితిపై ప్రధాని మోదీ సోమవారం దేశవ్యాప్తంగా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కరోనా వైరస్ పాండమిక్ అదుపునకు మరిన్ని సూచనలు చేయాలని, సలహాలు ఇవ్వాలని ఆయన వారిని కోరారు. ఈ అసాధారణ పరిస్థితుల్లో...

దేశవ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బందితో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, బ్లాక్ ఫంగస్ అదుపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన
pm modi video conference with ministers
Follow us on

దేశంలో కోవిడ్ పరిస్థితిపై ప్రధాని మోదీ సోమవారం దేశవ్యాప్తంగా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కరోనా వైరస్ పాండమిక్ అదుపునకు మరిన్ని సూచనలు చేయాలని, సలహాలు ఇవ్వాలని ఆయన వారిని కోరారు. ఈ అసాధారణ పరిస్థితుల్లో వీరు చేస్తున్న కృషి, పడుతున్న శ్రమ విలువ కట్టలేనివని ఆయన అభినందించారు. సెకండ్ వేవ్ కోవిద్ తరుణంలో ఫ్రంట్ లైన్ వారియర్లకు, కోవిద్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని ఆయన చెప్పారు. దేశంలో 90 శాతం మంది డాక్టర్లు, నర్సులు ఇతర వైద్య సిబ్బంది ఇప్పటికే తొలి డోసు తీసుకున్నారని తెలిపారు. బ్లాక్ ఫంగస్ గురించి మోదీ ప్రస్తావిస్తూ.. ఇది మనకు కొత్త సవాలుగా మారిందని, దీనిపై వైద్యులు అదనపు ప్రయత్నాలు చేసి దీన్ని అదుపులోకి తేవాలని కోరారు. కోవిద్ నుంచి కోలుకున్న రోగులకు ఇది సోకుతుందని తెలుస్తోందని, దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయన సూచించారు. విదేశాల్లో ఈ బ్లాక్ ఫంగస్ గురించి మనం వినలేదని ఆయన అన్నారు. కోవిద్ పై జరుపుతున్న సుదీర్ఘ పోరులో డాక్టర్ల మానసిక స్థితి కూడా ఒక్కోసారి బలహీనంగా మారవచ్చునని, ఈ పరిస్థితుల్లోనే వారు ఇదివరకటి కన్నా ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు.దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయని, ఇందుకు మీరు నిరంతరం చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తోందని ఆయన చెప్పారు. విదేశాల నుంచి అందుతున్న సాయం కూడా ఇవి తగ్గడానికి దోహదపడ్డయని అయన అభిప్రాయపదారు.

అటు ప్రధాని ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా కోవిద్ కేసుల తగ్గుదలకు ఉపకరించాయని డాక్టర్లు అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని చదవండి  ఇక్కడ :  Prabhas Adipurush video : ప్రాణాలు రిస్క్‌లో పెట్టలేను డార్లింగ్‌.. ఆదిపురుష్ కు తప్పని కష్టాలు..నిర్మాతలను ఒప్పించినా ప్రభాస్ ..(వీడియో).

 Vijay Sethupathi video : పెరుగుతున్న క్రేజ్ విజయ్ సేతుపతి బాలీవుడ్ లో ఎంట్రీ ..కత్రినా కైఫ్ తో విజయ్ షూట్ పోస్టుపోన్..(వీడియో).

 Viral Video : సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన దివ్యాంగుడు.. చేతులు లేకుండానే యువకుడు చేస్తున్న కృషికి ఫిదా అవుతున్న నెటిజన్లు ఫిదా ..(వీడియో).