ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి.. జమ్మూ కశ్మీర్‌ ఆయుష్మాన్ భారత్ స్కీం ప్రారంభోత్సవంలో ప్రధాని

|

Dec 26, 2020 | 3:07 PM

జమ్మూ కశ్మీర్ ప్రజల నిమిత్తమై ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు.

ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి.. జమ్మూ కశ్మీర్‌ ఆయుష్మాన్ భారత్ స్కీం ప్రారంభోత్సవంలో ప్రధాని
Follow us on

దేశంలో ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ వేదికగా ప్రతిరోజూ తనను విమర్శిస్తున్నారని, వారందరూ జమ్మూకశ్మీర్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. జమ్మూ కశ్మీర్ ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఆ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరు ఆరోగ్యవంతంగా ఉండాలన్న సంకల్పంతోనే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకువచ్చామని గుర్తించారు. దేశవ్యాప్తంగా పీఎంజేఏవై పథకం కింద 10.74 కోట్ల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున బీమా అందనుంది. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్‌ భారత్‌ కావడం గర్వంగా ఉందన్నారు ప్రధాని మోదీ.

కాగా, ఢిల్లీ వేదికగా కొందరు ప్రతి రోజూ తనకు ‘ప్రజాస్వామ్య పాఠాలు’ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని ప్రధాని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం ఎంత బలీయమైనవో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు చూపించాయి. ఢిల్లీ వేదికగా రోజూ నన్ను అవమానించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా… పాండిచ్చేరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేదన్న ప్రధాని.. కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్‌ను ప్రకటించగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామని వెల్లడించారు. జమ్మూ కశ్మీర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఓ ఉదాహరణ అని ప్రధాని అన్నారు.