PM Modi Address to Nation: జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ..

| Edited By: Ram Naramaneni

Nov 19, 2021 | 9:14 AM

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

PM Modi Address to Nation: జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ..
Pm Modi
Follow us on

PM Modi Address to Nation:  ప్రధాని నరేంద్ర మోదీ  జాతిని ఉద్దేశించి ప్రసంస్తున్నారు. ఆ వీడియో దిగువన చూడండి.

 

ప్రధాని ప్రసంగం హైలెట్స్…

రైతుల శ్రేయస్సు కోసమే వ్యవసాయ చట్టాలు..
అధికారంలోకొచ్చినప్పటి నుంచి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం..
80శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే..
రైతుల కష్టాలను చాలా దగ్గురుండి చూశాను..వారి కోసం పసల్‌ బీమా..
రైతుల అకౌంట్లలో లక్షల కోట్ల రూపాయలు జమ చేశాం…
తరతరాలుగా రైతులు తమ భూమిని కోల్పోతూ వస్తున్నారు..
రైతుల కష్టాలను దగ్గరుండి చూశాను…
రైతుల సంక్షేమానికే మా ప్రాధాన్యత..
దేశవ్యాప్తంగా రైతుల ఆవేదనను అర్థం చేసుకున్నాను…
వ్యవసాయం రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం..
దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచాం..
పంట నష్టాన్ని రైతులు సులభంగా పొందగలుగుతున్నారు…
ప్రభుత్వ చర్యలతో వ్యవసాయరంగం పురోగమిస్తోంది…
దేశంలో చిన్న రైతులు 10కోట్లకు పైగానే ఉంటారు…
కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను తీసుకొచ్చాం..
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..
గ్రామీణ మార్కెట్లను బలోపేతం చేశాం, ఎంఎస్‌పీ పెంచాం…
చిన్న రైతుల కోసం గ్రామాల భవిష్యత్‌ కోసం..గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం..
చిన్న రైతుల అభివృద్ధే లక్ష్యం…

కాగా ప్రధాని నేడు ఉత్తరప్రదేశ్‌లోని మహోబా, ఝాన్సీలకు వెళ్తారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేసింది. ఈరోజు ఉత్తర ప్రదేశ్ పర్యటనకు ప్రధాని వెళ్లనున్నారు. దానికంటే ముందుగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అకస్మాత్తుగా ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఈ సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రధాని తన ప్రసంగంలో ఏం చెప్పనున్నరనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తన ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఈరోజు మధ్యాహ్నం 2.45 గంటలకు మహోబాలో అనేక ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో నీటి కొరత సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ప్రాజెక్టులలో అర్జున్ సహాయక్ ప్రాజెక్ట్, రాటోలి వీర్ ప్రాజెక్ట్, భౌనీ డ్యామ్ ప్రాజెక్ట్ అలాగే, జాగాన్-చిల్లీ స్ప్రేయింగ్ ప్రాజెక్ట్ ఉన్నాయి.

ఝాన్సీలో, ఆయన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) రూపొందించిన మరియు అభివృద్ధి చేసిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ (LCH)తో సహా సాయుధ దళాల సర్వీస్ చీఫ్‌లకు స్వదేశీంగా రూపొందించిన మరియు అభివృద్ధి చేసిన పరికరాలను అధికారికంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్‌కు అందజేస్తాడు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నావల్ షిప్‌ల కోసం అధునాతన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ను నేవీ చీఫ్‌కి అందజేస్తుంది.

ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ ఇదే..