రైతుల ఖాతాల్లోకి రూ. 17,100 కోట్లను ‘బదిలీ’ చేసిన ప్రధాని మోదీ

| Edited By: Anil kumar poka

Aug 09, 2020 | 12:25 PM

పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలోని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ ఆదివారం.. రూ. 17.100 కోట్లను బదిలీ చేశారు. 2018 లో లాంచ్ చేసిన ఆరో విడత ఇన్స్ స్టాల్ మెంట్ లో ఇది భాగమని అధికారవర్గాలు తెలిపాయి.

రైతుల ఖాతాల్లోకి రూ. 17,100 కోట్లను బదిలీ చేసిన ప్రధాని మోదీ
Follow us on

పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలోని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ ఆదివారం.. రూ. 17.100 కోట్లను బదిలీ చేశారు. 2018 లో లాంచ్ చేసిన ఆరో విడత ఇన్స్ స్టాల్ మెంట్ లో ఇది భాగమని అధికారవర్గాలు తెలిపాయి. ఈ  స్కీమ్ లో భాగంగా మొత్తం 9.9 కోట్ల మంది రైతుల బ్యాంకు అకౌంట్ల లోకి నేరుగా 75 వేల కోట్లను అందజేస్తున్నట్టు ఈ వర్గాలు వివరించాయి. న్యూ అగ్రికల్చర్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ కోసం ప్రభుత్వం లక్ష కోట్లను కేటాయించింది. పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతు ఏడాదికి రూ. 6 వేల చొప్పున అందుకోగలుగుతాడు.

దేశంలో పోస్ట్ హార్వెస్ట్ {పంట పండిన అనంతరం) సీజన్ లో రైతులు తమ వ్యవసాయోత్పత్తులను నేరుగా ఏ ప్రాంతాలోనైనా విక్రయించుకోవడాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఇక రైతులకు  తమ ఉత్పత్తుల విక్రయానికి ఎలాంటి నిబంధనలూ అడ్డు రాబోవు. అంతర్ రాష్ట్ర రూల్స్ ని కూడా ప్రభుత్వం సడలించింది.