లదాఖ్ లో సైన్యానికి మోదీ ప్రశంస..తమిళ ‘ తిరుక్కురళ్’ ప్రస్తావన

| Edited By: Pardhasaradhi Peri

Jul 04, 2020 | 4:13 PM

లదాఖ్ లో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోదీ సైన్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. భారత సైనికుల అత్యంత విశ్వస నీయత. గౌరవ ప్రవర్తన, సాహసం వారిని అత్యున్నత స్థానంలో నిలబెట్టిందని ఆయన అన్నారు.  ఈ సందర్భంగా..

లదాఖ్ లో సైన్యానికి మోదీ ప్రశంస..తమిళ  తిరుక్కురళ్ ప్రస్తావన
Follow us on

లదాఖ్ లో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోదీ సైన్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. భారత సైనికుల అత్యంత విశ్వస నీయత. గౌరవ ప్రవర్తన, సాహసం వారిని అత్యున్నత స్థానంలో నిలబెట్టిందని ఆయన అన్నారు.  ఈ సందర్భంగా ప్రముఖ తమిళ కవి తిరువళ్ళువార్ రచించిన ‘తిరుక్కురళ్’  లోని ప్రవచనాలను ప్రస్తావించారు. ప్రజా జీవనంలో అన్ని వర్గాల వారికీ ఇప్పటికీ ఈ సూక్తులు అన్వయిస్తున్న విషయం గమనార్హం. ఈ దేశ గౌరవాన్నీ, అతి క్లిష్ట సమయాల్లోనూ  మన సైనికులు చూపుతున్న ధైర్య సాహసాలు, వారి వినమ్రత దేశానికే ఆదర్శమని మోదీ పేర్కొన్నారు. తిరుక్కురళ్ పుస్తకంలోని 766 వ అధ్యాయం లో గల ‘పడాది మచ్చి’ వాక్యాలను ఆయన గుర్తు చేశారు. సాయుధ దళాల దేశ భక్తి, వారు భావితరాలకు ఇస్తున్న స్ఫూర్తి చిరస్మరణీయమన్నారు. కాగా-గత ఏడాది దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా మోదీ.. ‘జల్-జీవన్’ గురించి ప్రస్తావిస్తూ.. నీటి పాధాన్యతను వివరించారు. ‘నీర్ ఇంద్ర అమయదు’ అనే పదాన్ని గుర్తు చేశారు. ఇలా తరచూ ఆయన.. తమిళ సూక్తులను పేర్కొంటూ ఆ భాషపై తనకు గల పట్టును చూపుతున్నారు.