‘ఆత్మ నిర్భర్ భారత్’ పై అద్భుతం ఆ గానం’.. మోదీ

| Edited By: Anil kumar poka

May 18, 2020 | 2:17 PM

'ఆత్మ నిర్భర్ భారత్ ' స్లోగన్ నేపథ్యంలో సుప్రసిధ్ద గాయని లతా మంగేష్కర్ షేర్ చేసిన ఓ పాటను 'మెలోడియస్ సాంగ్' గా ప్రధాని మోదీ అభివర్ణించారు. 211 మంది ప్రముఖ గాయనీ గాయకులు పాడిన 'జయతు జయతు భారతం..

ఆత్మ నిర్భర్ భారత్ పై అద్భుతం ఆ గానం.. మోదీ
Follow us on

‘ఆత్మ నిర్భర్ భారత్ ‘ స్లోగన్ నేపథ్యంలో సుప్రసిధ్ద గాయని లతా మంగేష్కర్ షేర్ చేసిన ఓ పాటను ‘మెలోడియస్ సాంగ్’ గా ప్రధాని మోదీ అభివర్ణించారు. 211 మంది ప్రముఖ గాయనీ గాయకులు పాడిన ‘జయతు జయతు భారతం.. వసుధైక కుటుంబం’ అనే ఈ సాంగ్ ని లత ట్విటర్ లో షేర్ చేశారు.ఈ వీడియోను  మోదీ రీట్వీట్ చేస్తూ.. ఆత్మ నిర్భర్ ఇండియా’కు ఇది మెలోడియస్ మెసేజ్’ అని పేర్కొన్నారు. ఈ పాట ఈ దేశంలోని ప్రతి వ్యక్తిలోనూ స్ఫూర్తి నింపుతుందన్నారు. జోషీ కలం నుంచి జాలు వారిన ఈ పాటను శంకర్ మహదేవన్ కంపోజ్ చేశారు. (దీన్ని భారత ప్రజలకు, ప్రధాని మోదీకి అంకితమిస్తున్నట్టు లతామంగేష్కర్ ట్వీట్ చేశారు).