లాక్ డౌన్ ‘ఉల్లంఘనులకు’ ఢిల్లీ పోలీసుల వింత శిక్ష

| Edited By: Anil kumar poka

May 18, 2020 | 12:06 PM

లాక్ డౌన్ ఉల్లంఘించి రోడ్ల మీదికి వచ్చినవారికి ఢిల్లీ పోలీసులు 'వింతయిన శిక్ష' విధించారు. వారికి గట్టి గుణపాఠం చెప్పడానికి భలే ఐడియా వేశారు. కరోనా రోగంతో మరణించిన రోగి డెడ్ బాడీని భుజాల మీద మోయాలని...

లాక్ డౌన్ ఉల్లంఘనులకు ఢిల్లీ పోలీసుల వింత శిక్ష
Follow us on

లాక్ డౌన్ ఉల్లంఘించి రోడ్ల మీదికి వచ్చినవారికి ఢిల్లీ పోలీసులు ‘వింతయిన శిక్ష’ విధించారు. వారికి గట్టి గుణపాఠం చెప్పడానికి భలే ఐడియా వేశారు. కరోనా రోగంతో మరణించిన రోగి డెడ్ బాడీని భుజాల మీద మోయాలని  ఇలాంటివారిని వారు ఆదేశించారు. దీంతో భయపడి పోయి తమ బైక్ ల మీద పారిపోబోతున్న వారిని మళ్ళీ పట్టుకుని.. వారికి ఈ ‘శిక్ష’ విధించారు. దీంతో లాక్ డౌన్ వయోలేటర్లలో వణుకు మొదలైంది. ఏమీ చెప్పలేక దిక్కులు చూస్తూ వచ్చారు వాళ్ళు..  ఆ స్ట్రెచర్ మీద ఉన్న కరోనా రోగి’డెడ్ బాడీ’ వైపు చూడడానికి కూడా సాహసించలేకపోయారు. అయితే అది నిజమైన మృత దేహం కాదట ! అది డమ్మీ డెడ్ బాడీ అట ! ఇంతేకాదు.. ఒక పోలీసునే స్ట్రెచర్ మీద శవంలా పడుకోబెట్టి..ఢిల్లీ పోలీసులు ఈ నాటకమాడారు. ఇదంతా ఖాకీల ప్లాన్ అని ఆ తరువాత తెలిసింది. లాక్ డౌన్ అంటే భయం లేనివారిలో  ఇలా భయం కలిగించడానికే.. మరోసారి వాళ్ళు రోడ్ల మీదికి రాకుండా ఉండడానికే ఈ ఐడియా వేశామని పోలీసోళ్లు తమలో తాము మురిసిపోతున్నారు.