కార్యకర్తలను విస్మరిస్తే ప్రమాదమే, సచిన్ పైలట్

| Edited By: Anil kumar poka

Aug 20, 2020 | 2:00 PM

పార్టీ నేతలకు , కార్యకర్తలకు  మధ్య సమన్వయం ఉండాలని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వీరిని  విస్మరించరాదని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్...

కార్యకర్తలను విస్మరిస్తే ప్రమాదమే, సచిన్ పైలట్
Follow us on

పార్టీ నేతలకు , కార్యకర్తలకు  మధ్య సమన్వయం ఉండాలని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వీరిని  విస్మరించరాదని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్…. లీడర్లకు సూచించారు. రాష్ట్రంలోని టోంక్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన..కార్యకర్తల ప్రయోజనాలకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలని అన్నారు. ఈ విధమైన అంశాలపై పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీతో కూడా చర్చించామని, త్వరలో వీరికి మంచి రోజులు రానున్నాయని చెప్పారు.

పైలట్ ప్రస్తావించిన డిమాండ్లలో ప్రధానమైన డిమాండును పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అప్పుడే తీర్చారు. రాష్ట్రంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండేని తొలగించి ఆయన స్థానే అజయ్ మాకెన్ ని నియమించారు. ఇక ఈయన చేసిన మరికొన్ని డిమాండ్లను త్రిసభ్య కమిటీ తీర్చే పనిలో ఉంది. పైలట్, ఆయన వెంట ఉన్న 18 మంది రెబెల్ ఎమ్మెల్యేలు ఇటీవలే సీఎం అశోక్ గెహ్లాట్ తో సయోధ్యకు రావడం, అసెంబ్లీలో గెహ్లాట్ బల పరీక్ష నెగ్గడంతో దాదాపు నెలన్నరపాటు సాగిన రాజకీయ సంక్షోభం పరిష్కారమైపోయింది.