డ్రోన్ల నుంచి ఆయుధాలను కిందికి వదులుతున్న పాకిస్తాన్

| Edited By: Pardhasaradhi Peri

Sep 22, 2020 | 6:31 PM

జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సరికొత్త ఆగడాలకు తెర తీస్తోంది. తమ ఉగ్రవాదులకోసం అది డ్రోన్లను వినియోగించి ఆయుధాలను కిందికి జారవిడుస్తోంది. జమ్మూ ప్రాంతం అఖ్నూర్ గ్రామం వద్ద రాత్రివేళ ఇలా..

డ్రోన్ల నుంచి ఆయుధాలను కిందికి వదులుతున్న పాకిస్తాన్
Follow us on

జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సరికొత్త ఆగడాలకు తెర తీస్తోంది. తమ ఉగ్రవాదులకోసం అది డ్రోన్లను వినియోగించి ఆయుధాలను కిందికి జారవిడుస్తోంది. జమ్మూ ప్రాంతం అఖ్నూర్ గ్రామం వద్ద రాత్రివేళ ఇలా కిందపడిన రెండు ఏకే ఎసాల్ట్ రైఫిల్స్, ఓ పిస్టల్, మూడు ఏకే మ్యాగజైన్లు, 90 రౌండ్ల తూటాలను జమ్మూ కశ్జ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రామం సరిహద్దులకు కేవలం 12 కి.మీ. దూరంలో ఉంది. ఇవి ఉగ్రవాదులకోసమని  జైషే మహమ్మద్ సంస్థ  నిర్దేశించి ఉండవచ్చునని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఇలా వెపన్స్ జారవిడిచేందుకు డ్రోన్లను వినియోగించడం ఇదే మొదటిసారని తెలుస్తోంది.