రాహుల్ గాంధీ నాయకత్వంపై కుట్ర, శివసేన ధ్వజం

| Edited By: Pardhasaradhi Peri

Aug 27, 2020 | 6:34 PM

కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి కారణమైన 'లేఖ', దానిపై సంతకాలు చేసిన 23 మంది సీనియర్ నేతలపై శివసేన 'శివమెత్తింది'. రాహుల్ నాయకత్వాన్ని అంతమొందించడానికి పన్నిన కుట్రే ఇదని..

రాహుల్ గాంధీ నాయకత్వంపై కుట్ర, శివసేన ధ్వజం
Follow us on

కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి కారణమైన ‘లేఖ’, దానిపై సంతకాలు చేసిన 23 మంది సీనియర్ నేతలపై శివసేన ‘శివమెత్తింది’. రాహుల్ నాయకత్వాన్ని అంతమొందించడానికి పన్నిన కుట్రే ఇదని ఆరోపించింది. ఆ లేఖలో కాంగ్రెస్ నాయకులు వాడిన  ‘పూర్తి స్థాయి నాయకత్వం’, సమిష్టి లీడర్ షిప్’ వంటి పదాలను సేన తన సొంత పత్రిక’ సామ్నా’లో ప్రస్తావించింది. ఈ ‘ పాత గార్డులు’ రాహుల్ పై అంతర్గతంగా ద్రోహ చర్యకు పాల్పడ్డారని, నిజానికి బీజేపీ కూడా ఆయనపట్ల ఆలా వ్యవహరించలేదని పేర్కొంది. ఈ నేతల్లో ఎవరూ జిల్లా స్థాయి నాయకులు కూడా కాదని, కానీ నెహ్రూ -గాంధీ పేర్లు చెప్పుకుని ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులయ్యారని శివసేన ఘాటుగా దుయ్యబట్టింది. ఇది అసలు సరికొత్త పొలిటికల్ కరోనా వైరస్ అని అభివర్ణించింది. ‘గులాం నబీ ఆజాద్ వంటివారిపై  ఇలా పరోక్షంగా శివసేన నిప్పులు కక్కింది.