Supreme Court: నుపుర్‌శర్మపై మండిపడ్డ సుప్రీంకోర్టు.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ..

|

Jul 01, 2022 | 11:51 AM

Supreme Court: మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నుపుర్‌శర్మపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

Supreme Court: నుపుర్‌శర్మపై మండిపడ్డ సుప్రీంకోర్టు.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ..
Supreme Court Main
Follow us on

Supreme Court: మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నుపుర్‌శర్మపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఉదయ్‌పూర్‌ ఘటనకు నుపూర్‌ కామెంట్స్‌ కారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు… మీడియా ద్వారా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. నుపుర్‌శర్మ వ్యాఖ్యలు ఆమె అహంకారాన్ని తెలియచేస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

లాయర్‌ అని నుపుర్‌ శర్మ చెప్పుకోవడం సిగ్గుచేటని సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించింది. స్వయంగా లాయర్‌ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. టీవీ డిబేట్‌లో నుపుర్‌శర్మ చేసిన వ్యాఖ్యలు తాను చూశానని , యాంకర్‌ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినప్పుడు కేసు ఎందుకు పెట్టలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రశ్నించారు.

నుపుర్‌శర్మపై దేశవ్యాప్తంగా కేసులు నమోదైనప్పటికి ఎందుకు అరెస్ట్‌ చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనప్పటికి ఢిల్లీ పోలీసులు కనీసం ఆమెను ప్రశ్నించలేకపోయారని మండిపడింది. దేశవ్యాప్తంగా తనపై నమోదైన కేసులులను ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్‌ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు నుపుర్‌శర్మ అయితే ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. నుపుర్‌శర్మ వ్యాఖ్యల తరువాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..