supreme court:ఆ కేసుల విచారణల విషయంలో హైకోర్టులను ఆపలేం, సుప్రీంకోర్టు స్పష్టీకరణ

| Edited By: Anil kumar poka

Apr 27, 2021 | 4:16 PM

ఈ కోవిడ్ తరుణంలో ఆక్సిజన్, మందులు తదితరాల  కొరతపై దాఖలైన పిటిషన్ల మీద హైకోర్టులు జరిపే  విచారణలను ఆపలేమని, సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ  పిటిషన్లపై కోర్టులు విచారణ జరపవచ్చునని..

supreme court:ఆ కేసుల విచారణల విషయంలో హైకోర్టులను ఆపలేం, సుప్రీంకోర్టు స్పష్టీకరణ
Supreme Court
Follow us on

oxygen shortage cases:ఈ కోవిడ్ తరుణంలో ఆక్సిజన్, మందులు తదితరాల  కొరతపై దాఖలైన పిటిషన్ల మీద హైకోర్టులు జరిపే  విచారణలను ఆపలేమని, సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ  పిటిషన్లపై కోర్టులు విచారణ జరపవచ్చునని పేర్కొంది. మేం వహించే పాత్ర ప్రశంసనీయంగా ఉండాలని మాత్రమే భావిస్తామని, కానీ ఈ సమయంలో మౌన ప్రేక్షక పాత్ర వహించజాలమని  తెలిపింది. .జాతీయ  సంక్షోభం తలెత్తినప్పుడు మౌనంగా ఉండలేమని వ్యాఖ్యానించింది. కోవిడ్ కి సం బంధించిన అంశాలపై విచారణ జరపకుండా హైకోర్టులను అడ్డుకోలేం..  ఒకవేళ వాటికి ఏదైనా సమస్య వస్తే వాటికీ సాయపడేందుకు సిద్ధంగా ఉంటాం అని న్యాయమూర్తులు డీ.వై. చంద్రచూడ్, ఎల్.నాగేశ్వర రావు , రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం సెల్లడించింది.  కేంద్రానికి నోటీసు జారీ చేసినందువల్ల ప్రయోజనమేమిటని,  ఈ ప్రొసీడింగులు హైకోర్టుల పనితీరును చేపట్టడానికి కావని బెంచ్ పేర్కొంది. హైకోర్టులకు విలువైన పాత్ర ఉందని ఈ బెంచ్ స్పష్టం చేసింది.

దేశంలో ఆక్సిజన్ కొరత, పంపిణీ, వ్యాక్సిన్, ఇతర మందుల అంశంపై  సుప్రీంకోర్టు గతవారం తనకు  తానుగా కేసు చేపట్టి కేంద్రానికి నోటీసు జారీ చేసింది. పైగా నేషనల్ ప్లాన్  రూపొందించాలని  సూచించింది.దేశ వ్యాప్తంగా 6 హైకోర్టులు ఈ  పిటిషన్లను విచారిస్తున్నాయని,  కానీ అయోమయం నెలకొందని ఈ ధర్మాసనం అభిప్రాయపడింది. అసలు హైకోర్టులకు జ్యూడిషియల్ అధికారాలు ఉన్నాయా అన్న విషయంపై సందేహాలు కలిగాయి. దీన్ని నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నించింది. మాజీ సీజేఐ బాబ్డే  నేతృత్వాన గల బెంచ్ దీన్ని కొంతవరకు విచారించింది. అయితే తాజాగా ఈ విషయమై సుప్రీంకోర్టు మంగళవారం హైకోర్టులను తాము ఆపలేమని స్పష్టం చేయడం విశేషం.